లగడపాటి మాట : తెలంగాణాలో కూటమిదే హవా !  

Lagadapati Rajgopal About Telangana Winners-

ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఇదే అంటూ … ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. వీరే విజేతలంటూ కొద్ది రోజుల క్రితం ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆయన. ఇవాళ హైదరాబాద్‌లో మీడియా ముందుకొచ్చారు...

లగడపాటి మాట : తెలంగాణాలో కూటమిదే హవా !-Lagadapati Rajgopal About Telangana Winners

మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించి వీరే విజేతలని చెప్పారు. లగడపాటి చెప్పిన ఆ ముగ్గురు పేర్లు… ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జి. వినోద్ గెలవబోతున్నట్లు లగడపాటి చెప్పారు.

అలాగే తెలంగాణాలో ఎన్నికలు వన్‌సైడ్‌గా జరగవని, పోటీ తీవ్రంగా ఉంటుందని వివరించారు. పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ రావొచ్చు అని చెప్పిన లగడపాటి.

ఒకవేళ తగ్గితే మహాకూటమికి అనుకూలంగా ఉంటుందన్నారు. 68.3 పోలింగ్ జరిగితే హాంగ్ వచ్చే అవకాశం ఉందన్నారు. వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌జిల్లాలో టీఆర్‌ఎస్‌కు..

రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభిస్తుందని చెప్పారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పోటాపోటీగా ఎన్నికల జరుగుతాయన్నారు.

హైదరాబాద్‌పాటు జిల్లాల్లో కూడా బీజేపీకి సీట్లు వస్తాయన్నారు. నగరంలో మజ్లిస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని లగడపాటి తేల్చి చెప్పారు.