లగడపాటి రాజగోపాల్‌ భార్య తెలంగాణ ఎన్నికల్లో ఎవరి తరపున ప్రచారం చేసిందో తెలిస్తే ఖంగు తింటారు  

తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి విజయవాడ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్‌ ఎంతటి సంచలనానికి తెర లేపాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదించే సమయంలో పెప్పర్‌ స్ప్రేతో అందరిని అల్ల కల్లోలం చేశాడు. తెలంగాణ ఏర్పాటు అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటూ ప్రకటించాడు. అన్నట్లుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికలకు మరియు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే లగడపాటి సర్వేలకు మంచి డిమాండ్‌ ఉంది. ఆయన ఎప్పుడు సర్వే చేసినా కూడా ఎక్కువ శాతం నిజాలు వస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా లగడపాటి సర్వే చేయించాడు. ఆ సర్వేలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా వెళ్లడయ్యింది.

Lagadapati Rajagopal Wife Campaign For Trs Party-Danam Nagender Lagadapati Candidate From Khairtabad

Lagadapati Rajagopal Wife Campaign For Trs Party

ఆ విషయాన్ని లగడపాటి మీడియాతో చెప్పడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్ర స్థాయిలో ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్‌ కూటమికి ఆయన అనుకూలంగా సర్వే ఫలితాలను వెళ్లడి చేస్తున్నాడు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం లగడపాటికి ఇష్టం లేదు అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. బాబు చెప్పినట్లుగా లగడపాటి వ్యాఖ్యలు చేస్తున్నాడని టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. లగడపాటి వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నట్లుగా గత రెండు మూడు రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో గడపాటి రాజగోపాల్‌ భార్య లగడపాటి పద్మ మాత్రం టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేస్తున్నారు.

Lagadapati Rajagopal Wife Campaign For Trs Party-Danam Nagender Lagadapati Candidate From Khairtabad

లగడపాటి పద్మ టీఆర్‌ఎస్‌ పార్టీ కండువ కప్పుకుని మరీ ఆమె టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ఆమె ఖైరతాబాద్‌ నియోజక వర్గంలో దానం నాగేందర్‌ కు మద్దతుగా ప్రచారం చేస్తోంది. ఇంటింటికి తిరిగి ఆమె దానంకు ఓటు వేయాలని, కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలంటూ కోరుతుంది. భర్త ఒక వైపు టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని చెబుతూ వస్తుంటే, పద్మ మాత్రం టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. భార్య భర్తల భిన్న స్వరాలతో తెలంగాణ ఎన్నికలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. లగడపాటి పద్మ టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయడంకు కారణం