ఆడవారే ఆధారం : ఫలితాలను డిసైడ్ చేసేది వారేనా ...?   Lady Voters In Telangana Is Essential For Decide The Result     2018-12-07   16:11:26  IST  Sai M

సమాజంలో ఆడవారంటే అందరికి కాస్త చిన్న చూపు ఉంటుంది. ఆడవారికి సమాన హక్కులు కల్పించేందుకు … పురుషులతో సమానంగా వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా..వారిపై సమాజంలో చిన్న చూపు మాత్రం పోవడం లేదు.కానీ వారి శక్తి ఏంటో సందర్భం వచ్చినప్పుడు అందరికి తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణాలో పోలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఈ రోజు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యి … 11 వ తేదీన ఎన్నికల రిజల్ట్ రాబోతోంది.నాయకుల భవితవ్యం తేలేది అప్పుడే. అయితే ఆ నాయకుల భవిష్యత్తు తేల్చేది మాత్రం మహిళలే. అవును తెలంగాణ ఎన్నికల అధికారుల లెక్కల ప్రకారం ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కాబోతున్నారట. రాష్ట్రంలో సుమారు 50 నియోజకవర్గాల్లో పురుషుల కంటే, మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు అని ఎన్నికల కమిషన్ లెక్కలతో సహా చెప్తోంది.

తెలంగాణాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ ఉందట. అక్కడ 15,388 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. నిజామాబాద్‌ రూరల్‌, నిర్మల్‌, ఆర్మూర్‌ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అత్యధిక ఓటర్లు మహిళలే.

Lady Voters In Telangana Is Essential For Decide The Result-Lady Result Elections

ఉత్తర తెలంగాణలోని 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే 5 వేలకు పైబడి అధికంగా ఉన్నట్టు లెక్కతేల్చింది. ఇటీవల ఈసీ విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 57 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండగా, తాజా లిస్టులో అది 50 స్థానాలకే ఉన్నట్టు లెక్క తేల్చారు. తెలంగాణాలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడానికి కారణాలు అయితే.. చాలా ఉన్నాయి.

Lady Voters In Telangana Is Essential For Decide The Result-Lady Result Elections

ఆ ప్రాంతాల్లోని మగవారు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు ఎక్కువ సంఖ్యలో వెళ్లడమే కారణమట. ఇక కరీంనగర్‌ కొత్త జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉండగా వాటిలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్‌లో మహిళా ఓటర్లే ఎక్కువ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. మహిళా ఓటర్లు అధికంగా ఉన్నందుకే, అన్నీ పార్టీలూ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటాయి. ఇక తుది జాబితాలోనూ రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా శేరిలింగంపల్లి నిలవగా, భద్రాచలం చివరి స్థానంలో ఉంది. శేరిలింగంపల్లిలో 5,49,773 మంది ఓటర్లు ఉండగా, భద్రాచలంలో 1,33,756 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,663 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. వీరిలో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 158 మంది ఉన్నట్టు ఈసీ వర్గాలు చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తోంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.