Lady teacher dance classroom : క్లాస్‌రూమ్‌లో ఐటమ్‌ సాంగ్‌కు లేడీ టీచర్ డ్యాన్స్.. వీడియో వైరల్..

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ షార్ట్స్ ఇలా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ప్రజలందరూ ఎక్కడబడితే అక్కడ వింత చేష్టలు, డ్యాన్సులు చేయడం మొదలు పెట్టారు.వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి మిగతా వారికి పిచ్చెక్కిస్తున్నారు.

 Lady Teacher Dancing To Item Song In Classroom.. Video Viral Item Songs, Teacher-TeluguStop.com

ఈ పిచ్చిలో పడి ప్రొఫెషనల్స్‌ కూడా డ్యూటీ చేస్తున్నప్పుడే ఇలాంటి వీడియోలు చేసి తమ జాబ్స్ నుంచి సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కాగా తాజాగా ఒక టీచర్ క్లాస్‌రూమ్‌లో డ్యాన్స్ చేసింది.

ఇంతవరకు ఓకే కానీ ఆమె స్టెప్పులేసింది మంచి పాటకి కాదు ఒక ఐటమ్ సాంగ్‌కి.క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్పాల్సిన ఆమె ఇలాంటి చెత్త పాటలకు డ్యాన్స్ వేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇది వైరల్ కావడంతో దీనిని చూసిన నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ‘పత్లి కమరియ మోరి‘ అనే భోజ్‌పురి సాంగ్‌కు క్లాస్‌రూమ్‌లోనే ఓ టీచర్ స్టెప్పులు వేయడం చూడవచ్చు.ఆమె అలా స్టెప్పులు వేస్తుంటే అదే క్లాస్ రూమ్ లో ఉన్న విద్యార్థులు కూడా ఎగురుతూ గెంతుతూ కెమెరా వైపు చూస్తూ కేరింతలు కొట్టడం చూడవచ్చు.పవిత్రమైన పాఠశాలలో, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్ పద్ధతిగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉంది.

ఒక టీచర్ లో పిల్లలు తమ పేరెంట్స్ ని చూసుకునేంత క్లాస్ గా ఉండాలి.కానీ ఈమె మాత్రం నడుముల ఊపుతూ క్లాస్‌రూమ్‌లో ఐటమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేస్తూ అందరి ఆగ్రహానికి కారణం అవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు ఈ టీచర్‌ను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.ఉపాధ్యాయులపై విద్యార్థుల్లో, సామాన్య ప్రజల్లో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి అని ఇంకొందరు హితవు పలుకుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube