సాయి పల్లవి మరో తప్పుడు నిర్ణయం.. ఈమెకు తెలివి ఉందా? లేదా?

ఈ మాట అనడానికి కాస్త కష్టంగా ఉంది కానీ అభిమానులు సాయి పల్లవి( Sai Pallavi )ని తెలివి ఉందా లేదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.సాయి పల్లవి హీరోయిన్ గా ఎన్నో సినిమాలు నటించి మెప్పించింది.

 Lady Power Star Sai Pallavi Says No To One More Big Movie,sai Pallavi,pan India-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు సాయి పల్లవి మంచి కమర్షియల్ స్టార్ హీరోకి జోడిగా మాత్రం నటించలేదు.అలాంటిది ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరిస్తు వస్తోంది.

సరే లేడీ ఓరియంటెడ్‌( Lady Oriented )సినిమాలైనా చేస్తుందా అంటే అది కూడా లేదు.

ఎన్నో అద్భుతమైన ఆఫర్స్ ని సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన సాయి పల్లవి మరో మంచి ఆఫర్ కి నో అంటూ తిరస్కరించిందనే ప్రచారం జరుగుతుంది.తమిళ స్టార్ హీరో( Tamil Star Hero ) కి జోడిగా ఈమెను ఎంపిక చేసేందుకు దర్శకుడు ప్రయత్నించాడట.పారితోషికం విషయంలో ఆమె డిమాండ్ చేసినంత ఇస్తానంటూ కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చాడట కానీ ఆమె అందుకు నిరాకరించిందని తెలుస్తోంది.

దాంతో తమిళ మీడియా లో సాయి పల్లవి గురించి రకరకాలుగా కథనాలు వస్తున్నాయి.ఆమె తెలివి ఉండి ఇలా ప్రవర్తిస్తుందా తెలివి లేకుండా ఇలా ప్రవర్తిస్తుందా అర్థం కావడం లేదని కొందరు అసహనం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం సాయి పల్లవి మనసులో ఇంకేదో ఉంది అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు.

ఇటీవల సాయి పల్లవి ఇటీవల కమిట్ అయిన సినిమా ఏ ఒక్కటీ లేదు.

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కాకుండా ఇప్పటి వరకు ఈమె నుండి ఏ ఒక్క సినిమా రాలేదు.ఈ ఏడాది ఆమె నటించిన సినిమాలు విడుదల అవుతాయా లేదా కూడా తెలియదు.లేడీ పవర్ స్టార్( Lady Powerstar ) అంటూ అభిమానులు పిలుచుకుంటున్న సాయి పల్లవి కి ఎన్నో ఆఫర్స్ వస్తున్నా కూడా తిరస్కరించడానికి కారణం ఏంటి అనేది అసలు క్లారిటీ రావడం లేదని.

ఎవరికీ బోధపడడం లేదని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.ముందు ముందు అయినా సాయి పల్లవి సినిమాలకు ఓకే చెబుతుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube