లేడీ జర్నలిస్టును లైవ్‌లో ఎక్కడ కొట్టాడో తెలుసా?

జర్నలిస్టులు అంటే సామాన్య ప్రజలకు వార్తలను అందించేవారిగా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి.వారిని అందరూ గరౌవంగా చూస్తుంటారు.

 Lady Journalist Youth Leader-TeluguStop.com

కానీ రాజకీయ నాయకులు, పలువురు నేతలు జర్నలిస్టులను కించపరిచే విధంగా ప్రవర్తిస్తుంటారు.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.

లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తున్న ఓ లేడీ జర్నలిస్టు పట్ల ఓ యూత్ లీడర్ అసభ్యంగా ప్రవర్తించడంతో ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

జార్జియాలో జరిగిన 10కే రన్ కవరేజీ కోసం వెళ్లిన లేడీ రిపోర్టర్ అలెక్స్ బోజార్జియన్‌ లైవ్‌లో కవరేజీ ఇస్తోంది.

ఈ క్రమంలో 10కే రన్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఆమెకు దగ్గరగా పరిగెడుతున్నారు.వారు కెమెరాకు అడ్డుగా రావడం లాంటివి చేస్తున్నా అలెక్స్ పట్టించుకోలేదు.

కానీ ఒక వ్యక్తి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చు ఆమెను వెనుక నుండి కొట్టాడు.దీంతో ఒక్కసారిగా అలెక్స్ అవాక్కయ్యింది.

అయినా తన లైవ్ కవరేజీని ఆపలేదు.

కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు వ్యక్తి టామి కాల్వేగా గుర్తించారు.

అతడొక యూత్ లీడర్‌గా గుర్తించగా తాను ఇది ఉద్దేశ్యపూర్వంగా చేయలేదని చెప్పుకొచ్చాడు.అటు నెటిజన్లు అతడిపై తీవ్ర విమర్శలు గుప్పుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube