భార్య ఉద్యోగానికి రాలేదని భర్తకు చెప్పిన కేషియర్ ని ఆ మహిళా ఉద్యోగిని చితక్కొట్టుడు కొట్టింది.గత రెండు రోజులుగా పనిలోకి రావడం రావడం లేదని మహిళా ఉద్యోగిని భర్తకు సమాచారం అందించాడు ఆసుపత్రిలో పనిచేసే కేషియర్.
అయితే భార్య,భర్తల మధ్య ఏమి జరిగిందో ఏమో గానీ భర్తకు సమాచారం అందించిన కేషియర్ ని మాత్రం సదరు మహిళా ఉద్యోగిని అందరి ముందు చితక్కొట్టుడు కొట్టింది.ఆమె ఒక్కతే కాకుండా అక్కడ పనిచేసే సిబ్బంది తో కలిసి మరి సదరు వ్యక్తిని ఒళ్ళు హూనం అయ్యేలా కొట్టింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.మధ్యప్రదేశ్ లోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని గత రెండు రోజులుగా పనికి రావడం లేదు.
అయితే ఈ సమాచారాన్ని ఆ ఆసుపత్రిలో కేషియర్ గా పని చేస్తున్న వ్యక్తి సదరు మహిళా ఉద్యోగిని భర్తకు విషయం చెప్పాడు.
మరి పరిస్థితులు ఏమి వచ్చాయో తెలియదు గానీ ఆ మహిళా ఉద్యోగిని అక్కడ పనిచేసే మరికొందరి తో కలిసి కేషియర్ పని పట్టింది.అంతటితో ఆగకుండా మరుసటి రోజు కూడా అతడి ఇంటికి వెళ్లి మరి అతడిపై దాడి చేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రస్తుతం ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం అతడు ఐసీయూ లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది.ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం తో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది
.