టెక్సాస్ పోలీసులకి షాక్ ఇచ్చిన మహిళ మృతదేహం...!!!  

Lady Dead Body Shocking Texas Police-fire,lady,mystery,officers,old House,police,shocking,telugu Nri Updates,texas

అమెరికాలోని టెక్సాస్ లో పాడుబడిన ఇంట్లోనుంచీ మంటలు వస్తున్నాయని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి అది పాడుబడిన ఇల్లని తెలుసుకున్నారు. అయితే ఎందుకైనా మంచిదని మంటలు వస్తున్నా సరే లోపలి వెళ్లి చూడగా కాలిపోతున్న ఓ మహిళ శరీరం కనిపించింది..

టెక్సాస్ పోలీసులకి షాక్ ఇచ్చిన మహిళ మృతదేహం...!!!-Lady Dead Body Shocking Texas Police

ఓ పాడుబడిన ఇంట్లో మహిళ ఉండటం, చుట్టూ పక్కల వారికి ఆ కాలుతున్నప్పుడు అరుపులు కూడా వినిపించడం అంతా మిస్టరీగా మారింది.

ఈ ఘటన టెక్సాస్‌లోని ఫోర్త్ ఎవెన్యూలో జరిగింది. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా ఆ ఇంటి గోడలు పగుళ్ళు తో ఉన్నాయని, అక్కడ వండుకుని తినడానికి కొన్ని సామాన్లు సరుకులు ఉన్నాయని. ఆమెతో ఒక్కతే ఇక్కడ ఉందని గ్రహించారు.

అయితే తమకి ఉన్న సమాచారం మేరకు ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదని, ఈ మహిళ కి ఎవరూ ఉండిఉండరు ఎక్కడ ఉండటానికి లేకపోవడంతోనే ఆమె ఇక్కడ ఉందని భావిస్తున్నారు.అయితే ప్రమాద వశాత్తు ఆమె చనిపోయిందా లేక కావాలని ఆమెని ఎవరైనా చంపి ఇంటికి నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.