ఫేస్బుక్ లో ఆ హాస్యనటి ఘోర అవమానం...సంబంధం లేని ఫోటోలు, వీడియోలు పెట్టి!       2018-07-06   22:18:05  IST  Raghu V

ఫస్ట్ టైం ..ఒక కొండ ఇంకో కొండ ఇంకో కొండ ఎక్కడం.. ఈ డైలాగ్ వినగానే మీకు నిన్ను కోరి సినిమాలోని నివేతకి ఫ్రెండ్ గా నటించిన విద్యుల్లేఖ గుర్తోచేసి ఉంటది. రన్ రాజా రన్, సరైనోడుతో కూడా మంచి పేరు సంపాదించుకుంది ఈ హాస్యనటి. ప్రస్తుతం సినిమా వాళ్లకు ఫేస్బుక్ లో ఎలాంటి ఫోలివింగ్ ఉందొ అందరికి తెలిసిందే. ఆఫిసిఅల్ పేజీలో వారు ఇచ్చే ఉపాదాట్లు కి విపరీతంగా లైక్స్ వచ్చేస్తూ ఉంటాయి.

ఫేస్బుక్ అకౌంట్స్ హాక్ అవుతూ ఉంటాయని మనం వింటూనే ఉంటాము. kani సినీ నటుల ఆఫిసిఅల్ పేజీ హాక్ అవ్వడం అంటే షాక్ కు గురవ్వాల్సిందే. అలంటి సంఘటన ఇప్పుడు విధ్యులేక అకౌంట్ కు ఎదురైంది.

ఆమె అఫీషియల్‌ ఫేస్‌బుక్‌ హ్యాకింగ్‌కు గురైంది. విద్యు ఫేస్‌బుక్‌ పేజీ మొత్తాన్ని ఫోటోలతోసహా మార్చేసిన హ్యాకర్లు.. రమ్య అనే పేరుతో ఫోటోలు, సమాచారాన్ని అప్‌లోడ్‌ చేశారు. దీంతో కంగారుపడిన ఆమె ట్విటర్‌లో విషయాన్ని తెలియజేశారు. తన ఖాతాను హ్యాక్ చేసిన వారు అందులో వేరే నటి ఫొటోలు, వీడియోలను పోస్టు చేశారని పేర్కొంది. తన పేజీని తానే నిర్వహించుకుంటున్నా ఇదెలా జరిగిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఖాతా హ్యాక్‌కు గురైన విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.

‘‘నా ఫేస్‌బుక్ పేజీ వ్యవహారాలన్నీ నేనే చేసుకుంటున్నా. కానీ ఈ ఊహించని సంఘటన ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితిలో ఫేస్‌బుక్ వారే ఏదో ఒకటి చేయాలి. కొద్దిసేపట్లో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తా’’ అని ట్వీట్‌లో పేర్కొంది.