జబర్దస్త్ లో అవకాశమందుకున్న నటి పాకీజా... ఇక కష్టాలు తీరినట్టేనా?

చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పాకీజా(Pakejaa) అలియాస్ వాసుకి (Vasuki)ఒకరు.వాసుకి అంటే టక్కున గుర్తు పెట్టకపోవచ్చు కానీ పాకీజా అంటే మాత్రం ఈమె అందరికీ గుర్తుండిపోతారు.

 Lady Comedian Pakeeja Got A Chance In Jabardasth Details, Nagababu,pakejaa,vasuk-TeluguStop.com

ఇలా 90 లలో ఎన్నో తెలుగు తమిళ సినిమాలలో లేడీ కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ప్రస్తుతం అవకాశాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.కనీసం ఉండటానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఒక హాస్టల్లో ఉంటూ ఈమె ఎన్నో ఆర్థిక ఇబ్బందులను పడుతున్నట్లు వెల్లడించారు.

ఇలా ఈమె ఆర్థిక కష్టాలను చూసి మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ఈమెకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు అలాగే మా అధ్యక్షుడు మంచు విష్ణు(Vishnu) మా మెంబర్ షిప్ ఈమెకు అందించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఈమెను ఆదుకోవడమే కాకుండా తాజాగా ఈమెకు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంలో కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది.లేటెస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో ఆమె రైజింగ్ రాజుతో పాటు స్కిట్ చేశారు.

వెండితెరపై సినిమా ఆఫర్స్ ఆమెకు రావడం లేదు.ఇలా అవకాశాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈమెకు జబర్దస్త్ అవకాశం వచ్చింది.కాబట్టి జబర్దస్త్ లో నిలదొక్కుకుంటే ఆమె ఆర్థిక కష్టాలు తీరినట్లేనని పలువురు భావిస్తున్నారు.

ఇక తను ఉన్న పరిస్థితులలో ప్రస్తుతం ఏ అవకాశం వచ్చిన వదులుకొనే పరిస్థితులలో నటి వాసుకి లేరు కనుక ఈమె జబర్దస్త్ ద్వారా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.మరి ఈ కార్యక్రమంలో ఈమె ఎన్నాళ్లపాటు కొనసాగుతారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube