స్టేజ్ మీదే జబర్దస్త్ కమెడియన్ పై దాడి.. అమ్మాయిని వేధించడంతో..?

ఈ మధ్య కాలంలో కొన్ని ఛానెళ్ల నిర్వాహకులు ప్రేక్షకుల్లో షోపై అంచనాలు పెంచడం కోసం ఫ్రాంక్ వీడియోలు, వివాదాలతో కూడిన స్కిట్లను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈటీవీ ప్లస్ ఛానల్ లో రెచ్చిపోదాం బ్రదర్ పేరుతో రాజీవ్ కనకాల జడ్జిగా గత కొన్నిరోజులుగా ఒక షో ప్రసారమవుతోంది.

 Lady Allegations On Jabardasth Venky In Rechipodam Brother Show-TeluguStop.com

ఈ షోకు సంబంధించిన ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ వెంకీ ఒకరు కాగా తాజాగా రిలీజైన ప్రోమోలో అతనిపై దాడి జరిగింది.

జబర్దస్త్ షోలో తక్కువ సమయంలోనే కామెడీ చేయడం ద్వారా వెంకీ మంచి పేరును సంపాదించుకున్నారు.

 Lady Allegations On Jabardasth Venky In Rechipodam Brother Show-స్టేజ్ మీదే జబర్దస్త్ కమెడియన్ పై దాడి.. అమ్మాయిని వేధించడంతో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మిమిక్రీ చేసే టాలెంట్ ఉండటంతో ఈ జబర్దస్త్ కమెడియన్ టీమ్ లీడర్ గా ప్రమోషన్ అందుకోవడం గమనార్హం.టీమ్ లీడర్ అయిన తర్వాత వెంకీకి క్రేజ్ మరింత పెరగడంతో పాటు యూట్యూబ్ లో సైతం వెంకీ స్కిట్లకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.

రెచ్చిపోదాం బ్రదర్ షో వెంకీ సైతం స్కిట్లు చేస్తున్నారు.

షోలో స్టూడెంట్లు పాల్గొంటూ ఉండటంతో ఈ షో బాగానే ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది.రియల్ లైఫ్ లో వివాదాలకు దూరంగా ఉండే వెంకీ ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ప్రేక్షకులను నవ్వించే విధంగా స్కిట్లను రాసుకుంటూ ఉంటారు.అయితే తాజా ప్రోమోలో వెంకీ ఒక అమ్మాయిని వేధిస్తున్నాడని కొంతమంది రెచ్చిపోదాం బ్రదర్ షోలోకి వచ్చారు.

వాళ్లతో పాటు ఒక యువతి కూడా అక్కడికి రావడం గమనార్హం.

కొందరు యువకులు వెంకీపై దాడి చేసినట్లు కనిపిస్తుండగా ఆ యువకులు బూతులు మాట్లాడటంతో వాటికి బీప్ వేశారు.

అయితే ఇది ఫ్రాంక్ వీడియో అని కొత్తగా ప్రారంభమైన షో కావడంతో ఇలా చేశారని సమాచారం.అయితే ఫ్రాంక్ చేస్తున్నారని తెలియకపోవడంతో వెంకీ నిజంగానే కంగారు పడ్డారని తెలుస్తోంది.

#Rajeev Kanakala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు