వేస‌విలో బెండ‌కాయ‌ను ఇలా తీసుకుంటే..శ‌రీర వేడి ప‌రార్‌!

వేస‌వి కాలం ప్రారంభం అయిపోయింది.ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు.

 Ladies Finger Helps To Reduce Body Heat-TeluguStop.com

బ‌య‌ట కాలు పెట్టేందుకే జంకుతున్నారు.అయితే ఈ వేస‌వి కాలంలో వాతావ‌ర‌ణ ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా శ‌రీరం త‌ర‌చూ వేడికి గుర‌వుతుంది.

దాంతో త‌ల‌నొప్పి, మైకం, వాంతులు, అల‌స‌ట‌, చెమట ఎక్కువగా పట్టడం, నోటి పూత‌, చికాకు వంటి అనేక స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.అందుకే శ‌రీర వేడిని ఎంత త్వ‌ర‌గా త‌గ్గించుకుంటే అంత మంచిది.

 Ladies Finger Helps To Reduce Body Heat-వేస‌విలో బెండ‌కాయ‌ను ఇలా తీసుకుంటే..శ‌రీర వేడి ప‌రార్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే శ‌రీర వేడిని త‌గ్గించ‌డంలో బెండ‌కాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌‌న దేశంలో అత్య‌ధికంగా వాడే కూర‌గాయ‌ల్లో బెండ కాయ ఒక‌టి.

మ‌న భార‌తీయులు బెండ కాయ‌తో ఎన్నో ర‌క‌ర‌కాల వంట‌లు త‌యారు చేస్తుంటారు.బెండ కాయ‌తో ఏ వంట‌కం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది.

అయితే రుచిలోనే కాదు బెండ కాయ‌లో పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, క్యాల్షియం, ఐరన్, జింక్‌, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు బెండ‌కాయ‌లో ఉంటాయి.

అందుకే బెండ‌కాయ‌ను వారానికి రెండు తీసుకోమ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా ఒంట్లో వేడి చేసిన వారు.రెండు బెండ కాయ‌ల‌ను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇప్పుడు ముక్కులుగా క‌ట్ చేసి.

ఒక గ్లాస్ వాట‌ర్‌లో వేసి రాత్రంతంగా నాన‌బెట్టుకోవాలి.ఇలా చేస్తే బెండ కాయ‌లో ఉండే పోష‌కాలు అన్నీ వాట‌ర్‌లోకి దిగుతాయి.

ఆ వాట‌ర్‌ను ఉద‌యాన్నే సేవించాలి.స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే శ‌రీరంలో వేడి త‌గ్గు ముఖం ప‌ట్టి చ‌ల్ల‌బ‌డుతుంది.

Telugu Benefits Of Ladies Finger, Body Heat, Good Health, Health, Health Tips, Ladies Finger, Ladies Finger For Health, Latest News, Summer, Summer Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే కంటి చూపు త‌గ్గుతుంద‌ని భావిస్తున్న వారు.బెండ కాయ‌లు నాన‌బెట్టిన‌ వాటర్‌ను తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.ఇక ఈ వాట‌ర్ తీసుకోవ‌డం ర‌క్త పోటు కూడా అదుపులో ఉంటుంది.

#Body Heat #LadiesFinger #Summer #Ladies Finger #Summer Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు