షాకింగ్.. కేజి బెండకాయలు 8500

కేజి బెండకాయలు 8500 రూపాయలు.మీరు చదివింది నిజమే.

 Ladies Finger Bendakaya Cost Is 8500 2-TeluguStop.com

కూరగాయలు ధర కొండెక్కడమంటే ఇదేనేమో.ఇంతింత రేట్లు పెరిగితే ఏం కొంటాం? ఏం తింటాం? అసలు తిండి తినాలా వద్దా? అనుకుంటున్నారా.ఈ 8500 వెనుక చిన్న పొరపాటు జరిగింది.మేం చేసింది కాదండోయ్.ఇది చదివితే పొరపాటు మీకే తెలుస్తుంది.ఏమరపాటు పనికిరాదని అర్దం అవుతుంది.

ఇటీవల సూపర్‌ మార్కెట్‌కు వెళ్లిన ఓ మహిళ సరుకులు తీసుకొని బిల్లింగ్‌ కౌంటర్‌ వద్దకు వచ్చి లైన్లో నిల్చున్నారు.సూపర్ మార్కెట్ అంటూ మన వీధి చివర ఉండేది కాదండోయే ప్రముఖ సూపర్ మార్కెట్.కరెక్ట్ గా బిల్చేసే టైంలో ఫోన్ వచ్చింది.ఫోన్ మాట్లాడుతూ బిల్లింగ్ అయ్యాక కార్డు ఇచ్చి పేమెంట్ చేసేసి బిల్ పర్సులో పెట్టుకుని ఇంటికొచ్చేశారు.కార్డ్ పేమెంట్ మెసెజ్ ఆ మహిళ భర్తకు వెళ్లింది.అంతే అది చూసాక ఆయనకు షాక్ కొట్టినంత పనైంది నెల సరుకుల బిల్ మూడు వేలు మహా అంటే ఐదు వేలు రావాలి కాని వచ్చిన బిల్ ఎంతో తెలుసా 11వేల పైన.వెంటనే షాక్ నుండి తేరుకుని భార్యకు ఫోన్‌ చేశాడు.భర్త చెప్పిన విషయంతో విస్తుపోయిన ఆమె.బిల్లును చెక్‌ చేయగా కిలో బెండకాయ ధర రూ.8500 పడింది.వెంటనే సదరు సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించింది.అప్పుడు అసలు విషయం బయటపడింది.

అసలేం జరిగిందంటే.

బిల్లింగ్‌ సమయంలో బెండకాయల ప్యాకెట్‌ మీది బార్‌కోడ్‌ స్కాన్‌ అవకపోవడంతో మాన్యువల్‌గా నమోదు చేస్తారు.అదికాస్తా కేజీకి బదులు వందల కేజీలు నమోదై రూ.8500 బిల్లు పడింది.తమ తప్పును గుర్తించిన సిబ్బంది మిగతా మొత్తాన్ని చెల్లించారు.సాధారణంగా సూపర్‌ మార్కెట్లలో షాపింగ్‌కు వెళ్లిన వారు బిల్లింగ్‌ కౌంటర్‌ వద్ద డబ్బు చెల్లించడమో, కార్డు ఇచ్చి నెంబర్‌ చెప్పడమో చేస్తుంటారు.

ట్రాలీలోని సరుకులను సంచుల్లో వేసుకునే హడావిడిలో బిల్లుపై పెద్దగా దృష్టి పెట్టరు.సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసే వారకి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం బిల్లును భద్రంగా దాచిపెట్టుకోవడం.

బిల్లు లేకపోతే అసలు మిమ్మల్ని ఖాతరు కూడా చేయరు.అదే బిల్ మన చేతిలో ఉంటే నాణ్యమైన సరుకు రాకపోయినా,ఏదైనా తేడా జరిగిన అధికారికంగా అడిగే రైట్ ఉంటుంది.

కాబట్టి ఏమరపాటుగా ఉంటే పొరపాట్లు తప్పవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube