'లడ్డుండా' మాస్ బీట్స్ అదుర్స్..స్వర్గంలో రెచ్చిపోతున్న బంగార్రాజు!

టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున కుర్ర హీరోలతో సమానంగా ఫిట్ నెస్ మైంటైన్ చేస్తూ ఇప్పటికి అందరికి గట్టి పోటీ ఇస్తున్నాడు.ఆరు పదుల వయసులో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ దూకుడుగా ఉన్నాడు.

 Laddunda Lyrical Song From Bangarraju Out Now,akkineni Naga Chaitanya, Akkineni-TeluguStop.com

ప్రెసెంట్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు.బంగార్రాజు సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన‘ సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్నినాయన అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది.ఇక ఇప్పుడు కూడా ఈ సినిమాను అదే ఎనర్జిటిక్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్.

ఇక ఈ సినిమాలో నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుండి ‘లడ్డుండా‘ లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు.

ఈ పాటను నాగార్జున స్వయంగా పాడారు.తన టాకింగ్ స్టైల్ లోనే నాగార్జున పాడినా కూడా ఈ పాట వినడానికి చాలా బాగుంది.నాగార్జున వాయిస్ కూడా ఈ పాట బీట్స్ కు మరింత సూట్ అవడమే కాకుండా ఈ పాటను మాస్ పాటగా మార్చేసింది.ఈ పాట స్టార్టింగ్ లోనే ఆయన చెప్పిన డైలాగ్స్ కూడా ఆకట్టు కుంటున్నాయి.

ఇక ఈ పాటను చూస్తేనే అర్ధం అవుతుంది.ఇది స్వర్గంలో వచ్చే పాట అని.

ఈ పాటలో నాగార్జున స్వర్గంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక లతో డాన్స్ వేస్తూ కనిపించాడు.అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాట మరొకసారి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాలో లడ్డుండా సాంగ్ లో నాగార్జున చేసిన డాన్స్, అల్లరి బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు అక్కినేని అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ మైసూర్ లో స్టార్ట్ అయ్యింది.

https://youtu.be/ekZlPzpeksk
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube