కాంగ్రెస్ లో కొరవడిన అలజడి...తెరవెనుక వ్యూహం రచిస్తోందా?

తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు బలపడడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ప్రస్తుతం రాజకీయ వాతావరణం ఉంది.

 Lack Of Turmoil In Congress Creating A Behind The Scenes Strategy Details, Telan-TeluguStop.com

అయితే క్షేత్ర స్థాయిలో బలమైన కార్యకర్తల నిర్మాణం కలిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని వెనక్కి నెట్టడంలో విఫలం అవుతున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ బాటలో కాకుండా కాంగ్రెస్ సరికొత్త రీతిలో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెంచేలా వ్యూహ రచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి ఇప్పటికే విమర్శల దాడిని పెంచుతున్నా రేవంత్ ఉన్నంత యాక్టివ్ గా మిగతా కాంగ్రెస్ నేతలు లేనటువంటి పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ మాత్రం తెర వెనుక వ్యూహం రచిస్తూ కాంగ్రెస్ ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ ను వీడిన బలమైన నేతలను తిరిగి కాంగ్రెస్ వైపు తిరిగి రప్పించేలా సదరు నేతలతో ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Revanth Reddy, Bandi Sanjay, Cm Kcr, Telangana-Political

పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగా టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించినా ప్రయోజనం అనేది ఉండే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే కాస్త బలపడ్డా కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం మునుపటి జోష్ మాత్రం కనిపించడం లేదు.అందుకే కాంగ్రెస్ నాయకత్వం వార్తల్లో ఉంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితితి మునుపటితో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు.దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ని ఇంకా బలపరచడంపై దృష్టి సారిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎంతో కొంత మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube