జగన్ లెక్క తప్పిందా ? ' కొత్త ' పదవులు దండగా ? 

ఏ విషయం పైన అయినా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చాలా క్లారిటీతో ఉంటారు.ఆచితూచి మరి అడుగులు వేస్తూ ఉంటారు.

 Lack Of Political Experience Edurkuntunnaru Trouble Municipal Chairmen In Many P-TeluguStop.com

అంతిమంగా తాను అనుకున్న పని అనుకున్నట్లుగా చేసే విషయంలో సక్సెస్ అవుతూ ఉంటారు.అయితే కొన్ని విషయాల్లో మాత్రం జగన్ లెక్క తప్పుతూ ఉంటుంది.

అనవసర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇప్పటికే చాలా విషయాల్లో అటువంటి పరిస్థితులను జగన్ ఎదుర్కొంటున్నారు.

ఇక ఇప్పుడు అదే పరిస్థితి మరో విషయంలోనూ ఎదురవుతోంది.  ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంది.

టీడీపీకి కేవలం ఒకే ఒక్క మున్సిపల్ చైర్మన్ పదవి దక్కింది.ఇక వైసీపీ గెలిచిన అన్నిచోట్ల జగన్ సరికొత్త ప్రయోగం చేశారు.

రాజకీయ అనుభవం ఉన్న వారికి కాకుండా,  కొత్తగా గెలిచిన వారికి ప్రజలలో పలుకుబడి లేని వారిని, జగన్ మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్ లుగా నియమించారు.

ఈ నిర్ణయం పై పార్టీలో కాస్త అసంతృప్తి చెలరేగినా, కొంతమంది పార్టీ సీనియర్ నాయకులు జగన్ నిర్ణయాన్ని అంతర్గతంగా తప్పుపట్టినా, జగన్ మాత్రం ఆ ప్రయోగం చేశారు.

దీంతో రాజకీయ అనుభవం లేని వారు చాలా చోట్ల చైర్మన్ లుగా కొనసాగుతున్నారు.అయితే వీరిలో చాలా మందికి రాజకీయ అనుభవం లేదని గ్రహించిన జగన్ ప్రత్యేకంగా వారికి శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహించారు.

ఈ విషయాల్లో ట్రైనింగ్ ఇప్పించారు.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం విజృంభించడంతో ఎక్కడికక్కడ కరోనా కు సంబంధించిన జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంటోంది.

అయితే కొత్తగా ఎంపికైన మున్సిపల్, కార్పొరేషన్ చైర్మన్ లు తడబాటుకి గురవుతున్నారట.చాలామంది క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించేందుకు కూడా ఇష్టపడడం లేదట.

దీనికి కారణం పరిపాలనా అనుభవం తక్కువగా ఉండడంతో పాటు, కరోనా భయం కూడా ఉండడంతో క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు వెనకడుగు వేస్తున్నారట.దీంతో చాలాచోట్ల కరోనా నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయట.

Telugu Ap, Carona, Jagan, Muncipal, Ysrcp-Telugu Political News

అధికారులు చొరవ తీసుకుని ముందుకు వెల్దామన్నా, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన చైర్మన్ లు అందుబాటులో లేకపోవడం వారికి ఇబ్బందికరంగానే మారిందట.దీంతో అనవసర విమర్శలు రావడంతో పాటు , రాజకీయ పరిపాలనా పరమైన అనుభవం, అవగాహన ఏమాత్రం లేని వారికి అనవసరంగా ఈ పదవులను జగన్ కట్టబెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటే ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అభ్యర్థులుగా ప్రచారం చేసుకున్న వారికి ఫలితాల తర్వాత ఆ పదవులు దక్కలేదు.సామాజికవర్గాల లెక్కల ఆధారంగా జగన్ ఎంపికలను పూర్తి చేయడంతో,  మెజార్టీ మున్సిపాలిటీల్లో కొత్త వారే బాధ్యతలు స్వీకరించారు.

గతేడాది కరోనా మొదటి వేవ్ లో ఈ బాధ్యతలను పూర్తిగా అధికారులు నిర్వర్తించారు.అప్పుడు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడంతో వారు మొదటి వేవ్ అడ్డుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇప్పుడు దానికి సంబంధించిన నిర్ణయాలు మున్సిపల్ చైర్మన్ లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండడం,  వారు అందుబాటులో లేకపోవడం ఇవన్నీ పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube