అమెరికా నిరుద్యోగ భ్రుతికి వెల్లువలా దరఖాస్తులు...ఎన్నో తెలుసా..!!!

ప్రపంచ దేశాలను కరోనా కాటేసింది ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యమైతే అతలాకుతలం అయిపోయింది.ఒక్కసారిగా అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థంభించి పోవడంతో పాటు వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు.

 Labor Department, Usa, America, Jobs Lost, Unemployement-TeluguStop.com

ఫలితంగా అమెరికా వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువైపోయింది.అక్కడి ప్రజల చేతుల్లో డబ్బుల్లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో అమెరికా నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం చేపట్టింది.అందుకుగాను నిరుద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.దాంతో ఒక్క సారిగా లేబర్ డిపార్ట్మెంట్ కి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి.ఈ మొత్తం లెక్కేసిన సదరు డిపార్ట్మెంట్ నిరుద్యోగ బృతికి అప్ప్లై చేసుకున్న వారు మొత్తం కలిపి దాదాపు 66 లక్షల మందని తెలిపింది.అయితే

Telugu America, Jobs, Labor-

ఈ సంఖ్య కేవలం మొదటివారం నిరుద్యోగ భృతి కి దరఖాస్తు చేసుకున్న వారని తెలిపింది.అమెరికాలో రూల్స్ ప్రకారం…ఉద్యోగులు ఎటువంటి తప్పు చేయకుండానే వారిని కంపెనీ ఉద్యోగం నుంచి తీసి వేస్తే ప్రభుత్వం వారికి ప్రతీ వారం నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది.ఇది అక్కడి నిబంధన.కానీ తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం పోయిన వాళ్ళే కాకుండా సొంతగా వ్యాపారాలు చేసుకునే వారిని, ఫ్రీలాన్సర్ లను కూడా నిరుద్యోగ భృతి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది దాంతో ఉద్యోగం పోయిన వారు ఉద్యోగం లేని వారు ఇలా ఎంతో మంది నిరుద్యోగ భృతి దరఖాస్తు చేసుకున్నారు.

ఒక్క వారానికే 66 లక్షల అయితే ప్రతీ వారం ఇన్ని నిధులు ఎలా సమకూర్చుతారు.మునుముందు ఊడిపోయే ఉద్యోగాల ద్వారా పెరిగిపోయే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి అసలు అమెరికా భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube