ఆహారం కన్నా నీరే ఖరీదు.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్ దేశం

పశ్చిమాసియా దేశమైన లెబనాన్ లో  తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తలెత్తింది.ఆహారం కంటే నీరు 8 రెట్లు ఖరీదైంది.

 Labanon Country In Severe Food Crises Water Becomes Expensive Than Food, Labanon-TeluguStop.com

ఆహార పదార్థాలు, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.రోజుకు 1గంట మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుంది.

ఆరోగ్య సేవలు అస్తవ్యస్తంగా మారాయి.పాఠశాలలు పూర్తిగా మూతపడ్డాయి.

ఈ సమస్యల మధ్యే లెబనాన్ లో నూతన ప్రధానమంత్రిగా ‘నజీబ్ మికటి’ బాధ్యతలు చేపట్టారు.అయినా గతంలో కూడా ఈ పదవిలో కొనసాగారు.

గత యేడాది బీరుట్ లో పేలుడు ఘటన తో నెలకొన్న రాజకీయ సంక్షోభంతో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి.1,000 లెబనీస్ పౌండ్ల కు లభ్యమయ్యే లీటర్ డీజిల్, పెట్రోలు ఇప్పుడు 6,500 లెబనీస్ పౌండ్ల గా మారింది.150 ఏళ్లలో లెబనాన్ ప్రస్తుత ప్రపంచంలోనే అత్యంత అధ్వాన స్థితిలో ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

జనాభాలో 75 శాతం మంది పేదరికాన్ని ఎదుర్కొంటున్నారు.గత రెండు సంవత్సరాల్లో మరింతగా దిగజారింది దేశంలో నిరసనలు భగ్గుమంటున్నాయి.అల్లర్లు జరుగుతున్నాయి.ఉత్తర నగరం ట్రీపోలీ, ఇతర ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సంక్షోభం గందరగోళ పరిస్థితులకు దారి తీయవచ్చని నిపుణుల అంచనా.మనుగడ కోసం ప్రజలు దేనికైనా తెగబడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube