అమీర్ ఖాన్‌కు ఘోర పరాభవం.. షోలు క్యాన్సిల్, పడిపోయిన కలెక్షన్లు!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా.ఇందులో కరీనాకపూర్ హీరోయిన్ గా నటించగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

 Laal Singh Chaddha Raksha Bandhan Day 2 Box Office Collection , Amir Khan, Lal Singh Chadda, Bollywood, Box Office Collections-TeluguStop.com

ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ఫారెస్ట్‌ గంప్‌ సినిమాకు హిందీ రీమేక్‌గా తెరకెక్కించారు.కాగా ఈ సినిమాకు అద్వెత్‌ చందన్‌ దర్శకత్వం వహించగా వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్,అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అమీర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌ లతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 Laal Singh Chaddha Raksha Bandhan Day 2 Box Office Collection , Amir Khan, Lal Singh Chadda, Bollywood, Box Office Collections-అమీర్ ఖాన్‌కు ఘోర పరాభవం.. షోలు క్యాన్సిల్, పడిపోయిన కలెక్షన్లు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు ఉహించని విధంగా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.అనుకున్న విధంగా సక్సెస్ ని సాధించలేకపోయింది.సినిమా రిలీజ్‌ రోజైన ఇటీవల గురువారం 11.70 కోట్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు శుక్రవారం 7.26 కోట్లకు పడిపోయింది.మొత్తంగా లాల్ సింగ్‌ చద్దా తొలి రెండు రోజుల్లో రూ.18.96 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది.

Telugu Amir Khan, Bollywood, Box-Latest News - Telugu

అంటే ఈ సినిమా కనీసం రూ.20 కోట్ల మార్క్‌ను కూడా చేరుకోలేకపోయింది.కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ ప్రారంభం నుంచే బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ లో భాగంగా లాల్‌ సింగ్‌ చద్ధా పై సోషల్‌ మీడియాలో నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం జరిగింది.బాయ్‌కాట్‌ లాల్‌ సింగ్‌ చద్ధా అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌ కూడా అయింది.

అమీర్‌ ఖాన్‌ సినిమా ఇలా తక్కువ వసూళ్లు సాధించడానికి ఈ ట్రెండింగే కారణంగా తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube