ఎల్ రమణ లక్కంటే నీదేనోయి... ఏళ్లుగా ఉన్న వారిని కాదని..

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎల్.రమణ పేరు మార్మోగిపోతుంది.

 L Ramana Lakkante Nidenoi Not Those Who Have Been For Years,ramana, Trs-TeluguStop.com

ఇలా పార్టీ మార్చగానే ఆయన ఎమ్మెల్సీ పదవిని కొట్టేశారని అంతా అనుకుంటున్నారు.ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటే ఉన్న వారికి కూడా పదవులు లభించలేదని కానీ ఎల్.రమణకు మాత్రం పార్టీ మారడంతోనే పదవి లభించిందని చెబుతున్నారు.ఎల్.రమణకు చాలా లక్ ఉందని అంటున్నారు.బీసీ నేత అయిన ఎల్.రమణ హుజురాబాద్ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి కారెక్కారు.అలా ఆయన పార్టీ మారగానే ఇలా కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు.

నిజానికి రమణకు ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ ముందుగానే ఆఫర్ చేశారు.దీంతోనే ఆయన పార్టీ మారారు.

కానీ హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ రమణకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా? లేదా అన్న అనుమానం అందరిలోనూ కలిగింది.కానీ కేసీఆర్ మాత్రం ముందు మాట ఇచ్చిన విధంగా రమణను ఎమ్మెల్సీ చేశారు.

Telugu Cm Kcr, Ramanalakkante, Mlc, Ramana, Tg, Ts-Telugu Political News

టీడీపీలో సుధీర్ఘ కాలం పని చేసిన రమణకు రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధ్యక్షుడిగా పని చేసే అవకాశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కల్పించారు.అప్పటి నుంచి రమణ టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు.కానీ సడెన్ గా పరిణామాలు ఒక్క సారిగా మారిపోయాయి.టీఆర్ఎస్ లో ఉన్న బీసీ నేత ఈటల రాజేందర్ మీద వేటు పడడం ఎల్.రమణకు బాగా కలిసొచ్చింది.దీంతోనే టీఆర్ఎస్ రమణను పార్టీలోకి తీసుకుంది.

అనంతరం పెద్దల సభకు కూడా పంపుతోంది.కరీంనగర్ స్థానం నుంచి పోటీ చేసిన రమణ విజయం మీద కొంత సందేహాలు వ్యక్తం అయినప్పటికీ ఆయన సత్తా చాటారు.2009లో ఆయన ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టారంటే మరలా ఇప్పుడు ఎమ్మెల్సీగా సభకు వెళ్తున్నారు.2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన గెలవలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube