సైబర్ థ్రిల్లర్ గా గుహన్ కొత్త సినిమా టీజర్... ఆన్ లైన్ వీడియో చాటింగ్  

సినిమాటోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి కెవి గుహన్.ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కెమెరామెన్ గా పని చేసిన గుహన్ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాని కళ్యాణ్ రామ్ తో 118 అనే సినిమా చేశారు.ఈ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా తర్వాత రెండో సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ తోసైబర్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్నారు.డబ్యూడబ్యూడబ్యూ టైటిల్ తో సినిమాని తెరకెక్కించారు.అదితి అరుణ్, శివానీ రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య శ్రీపాద మెయిన్స్ లీడ్స్ గా సినిమాని తెరకెక్కించారు.

TeluguStop.com - Kv Guhan Www Movie Teaser Talk

అయితే ఈ సినిమా మొత్తం పది లోపు పాత్రలతోనే పూర్తి చేయడం విశేషం.దాంతో పాటు కథ మొత్తం ఆన్ లైన్ వీడియో చాటింగ్ రూమ్ ద్వారా నేరేట్ చేశారు.

ఈ మధ్యకాలంలో మలయాళంలో ఇలాంటి కథాంశంతోనే ఫాజిద్ ఫైజల్ ఒక సినిమా చేశారు.దానిని డిజిటల్ లో రిలీజ్ చేశారు.

TeluguStop.com - సైబర్ థ్రిల్లర్ గా గుహన్ కొత్త సినిమా టీజర్… ఆన్ లైన్ వీడియో చాటింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

గుహన్ కూడా అలాంటి సైబర్ కాన్సెప్ట్ తో సినిమాని ఆవిష్కరించారు.

ఈ సినిమాకి సంబందించిన టీజర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.

టీజర్ లో ఆన్ లైన్ వీడియో చాటింగ్ లో ఒక్కో పాత్రని పరిచయం చేసి తరువాత వారి చుట్టూ ఏదో జరుగుతుందనే థ్రిల్లింగ్ ఎలిమెంట్ ని ప్రెజెంట్ చేశారు.వారిని ఎవరో టార్గెట్ చేశారని అర్ధం చేసుకున్న ఆ నలుగురు అందులోనుంచి ఎలా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు అనే ఎలిమెంట్ ని సస్పెన్స్ గా చూపించబోతున్నారు.

ఇక టీజర్ అయితే మంచి ఆసక్తికరంగా నడిపించారు.ఇలాంటి కథాంశంతో రెండు గంటల పాటు ఆడియన్స్ ని థియేటర్ లో ఎలా కూర్చోబెడతారు అనేది వేచి చూడాలి.

#Aditi Arun #@kvguhan #@Rshivani_1 #Viva Harsha #SuperStar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు