కువైట్ కొత్త ప్రతిపాదన...ఆ ఎన్నారైలకు గుడ్ న్యూస్...!!!

కువైట్ ప్రభుత్వం గడిచిన కొంత కాలంగా తమ దేశంలో ఉంటున్న ఎన్నారైల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.కువైటైజేషన్ లో భాగంగా వలస వాసులకు చెక్ పెడుతూ వస్తున్న అక్కడి ప్రభుత్వం ఎన్నో కారణాలు, సాకులు చెప్తూ ఏళ్ళ తరబడి పనిచేస్తున్న ఎంతో మందిని దేశం నుంచీ వెళ్ళగొట్టింది.అదే సమయంలో 60 ఏళ్ళు పై బడిన ఎన్నారైలతో మనకేం పనిలో అనుకున్న కువైట్ వారిని కూడా వెళ్లగొట్టేందుకు వారి వీసాల రెన్యువల్ విషయంలో సవాలక్ష కండిషన్లు విధించింది.

 Kuwait's New Proposal  Good News For Those Nris , Public Authority Of Man Power,-TeluguStop.com

60 ఏళ్ళు పై బడిన వారు తప్పకుండా డిగ్రీ స్థాయి సర్టిఫికెట్ ఉండాలని అలంటి వారికి మాత్రమే వర్క్ పర్మిట్ లు ఇస్తామని కీలక ప్రకటన చేసింది.అయితే అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కువైట్ ప్రభుత్వం అప్పటి నుంచీ 60 ఏళ్ళు పై బడిన వారి విషయంలో వర్క్ పర్మిట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ తాజాగా కువైట్ ప్రభుత్వం వీరి విషయంలో సానుకూలంగా స్పందిస్తోంది.తాజాగా

పబ్లిక్ అధారటీ ఆఫ్ మ్యాన్ పవర్ 60 ఏళ్ళు పై బడిన ఎన్నారైల విషయంలో సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చింది.60 ఏళ్ళు దాటిన వారు హై స్కూల్ , డిప్లమో అంతకంటే తక్కువ అర్హత ఉన్న వారికి వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.అయితే పర్మిట్ రెన్యువల్ ఫీజును మాత్రం 250 కువైటీ దీనార్లుగా ప్రకటించింది.

ఈ ప్రతిపాదన త్వరలో జరగనున్న బోర్డు చర్చలలో చర్చకు వస్తుందని తెలుస్తోంది.అదే జరిగితే 60 ఏళ్ళు పై బడిన ప్రవాసులకు భారీ లబ్ది చెకూరనుందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube