కువైట్ కీలక నిర్ణయం...మరో సారి అమలు కానున్న ఆ నిభందన..!!!

ప్రవాస కార్మికులు వలస వెళ్లేందుకు ప్రధమంగా ఎంచుకునే దేశాలలో ఒకటి కువైట్.అరబ్బు దేశాలు అన్నిటిలో కంటే కూడా కువైట్ వెళ్లేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు.

 Kuwait's Key Decision That Provision To Be Implemented Again , Kuwait, Country-TeluguStop.com

కువైట్ దేశం ఎన్ని ఆంక్షలు విధించినా సరే ఆ దేశంలో ఉద్యోగం దొరికితే చాలు అన్నట్టుగా భావిస్తున్నారు.అయతే కరోనా సమయంలో ఆ దేశం విధించిన ఆంక్షలు నేపధ్యంలో ఎంతో మంది ప్రవాసులు వారి వారి స్వదేశాలలో ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు.కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా తగ్గుముఖం పట్టిన తరువాత ఆంక్షలను సడలించడంతో.

ప్రవాస కార్మికులు మళ్ళీ కువైట్ ప్రయాణాలు చేపట్టారు.అయితే తాజాగా కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రవాసులను మరో సారి ఆందోళనలోకి నెట్టేస్తోంది.కరోనా మహమ్మారి సర్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో కరోనా కేసులు కువైట్ దేశంలో పెరుగుతున్నాయని, ఈ క్రమంలో గతంలో మాదిరిగానే కరోనా సోకిన వారిని గతంలో ఐసోలేషణ్ లో ఉంచే ప్రక్రియ అమలులోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించడంతో కువైట్ వాసులు ముఖ్యంగా ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐదు రోజుల పాటు ఐసోలేషణ్ లో ఉన్నప్పటి నరకాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

అంతేకాదు భారత్ వెళ్లి తమ కుటుంభ సభ్యులను చూసుకోవాలని భావిస్తున్న ఎన్నారైలు, కువైట్ విడిచి వస్తే మళ్ళీ రాకపోకలపై ఆంక్షలు ఎక్కడ విదిస్తారోనని ప్రయాణాలను విరమించుకుంటున్నారు.ఇదిలాఉంటే కువైట్ ప్రభుత్వం కరోనా కేసులను మానిటరింగ్ చేసేందుకు గతంలో ఉపయోగించిన ష్లోనిక్ యాప్ స్థానంలో సరికొత్త ఇమ్యూన్ యాప్ ను తీసుకువచ్చింది.

బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి తీరాలని మరో సారి నిభంధనలను అమలు చేస్తోంది కువైట్ ప్రభుత్వం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube