ప్రపంచంలోనే ఫస్ట్‌ టైం... పెళ్లైన 5 నిమిషాలకే విడాకులు

అన్ని బందాల్లోకి వైవాహిక బంధం చాలా గొప్పది, బలమైనది అంటూ హిందూ ధర్మం చెబుతోంది.అమ్మ, అక్క, అన్న లాంటి వారు రక్త సంబంధం కారణంగా మనపై ప్రేమను చూపిస్తారు.

 Kuwaiti Couple Divorce Five Minutes After Marriage-TeluguStop.com

కాని భార్య లేదా భర్త మాత్రం మనతో ఎలాంటి రక్త సంబంధం లేకుండానే తమ భాగస్వామిపై అత్యంత ప్రేమను కనబరుస్తారు.జీవితాంతం తోడుగా ఉంటూ ఒకరిని ఒకరు చూసుకుంటూ జీవిస్తారు.

అలాంటి బందం కొన్ని సార్లు తెంపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.అవతలి భాగస్వామితో జీవితం సాగించడం కష్టం అనిపించినప్పుడు మరో ఆలోచన లేకుండా విడాకులు తీసుకోవడమే బెటర్‌.

విడాకులు తీసుకోవడం అనేది అత్యంత కఠినమైన నిర్ణమే.కాని కలిసి ఉండి కష్టాలు పంచుకోవడం కంటే విడిపోయి సంతోషంగా ఉండటం ఉత్తమం అనేది కొందరి అభిప్రాయం.

అందుకే కువైట్‌ లో పెళ్లి అయిన కేవలం అయిదు నిమిషాలకే విడాకులు అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… అరబ్‌ దేశం అయిన కువైట్‌ లో ఒక జంట రిజిస్ట్రర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

కువైట్‌ ప్రభుత్వ రూల్‌ ప్రకారం రిజిస్ట్రర్‌ మ్యారేజ్‌ జడ్జ్‌ ముందు జరుగుతుంది.పెళ్లి చేసుకుని సంతోషంగా వధువు వరుడితో కలిసి బయటకు వస్తుంది.రిజిస్ట్రర్‌ ఆఫీస్‌ లో పెళ్లి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో పొరపాటున పెళ్లి కూతురు జారి పడింది.కింద పడ్డ పెళ్లి కూతురును అయ్యో అంటూ లేపడం మానేసి పెళ్లి కొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కనీసం చూసుకుని నడవడం రాదా, ఎటు చూస్తున్నావు, ఎక్కడ నీ ధ్యాస ఉంది అన్నట్లుగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడట.

కింద పడిన తనపై కనీస కనికరం చూపకుండా పైగా తిట్టడంతో వధువు ఇతడితో జీవితాంతం తాను జీవితం పంచుకోలేను అంటూ పెళ్లి చేసిన జడ్జ్‌ వద్దకు వెళ్లి సంఘటన వివరించిందట.ఆమె చెప్పిన దాంట్లో న్యాయం ఉందనిపించిన జడ్జ్‌ వెంటనే ఇద్దరికి విడాకులు మంజూరు చేయడం జరిగింది.పెళ్లి, కింద పడటం, విడాకులు ఇవన్నీ కూడా కేవలం అయిదు నిమిషాల వ్యవధిలోనే జరిగి పోయాయట.

కొన్నాళ్ల క్రితం దుబాయిలో పెళ్లి అయిన 15 నిమిషాలకు జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్‌ అయ్యింది.పెళ్లి అయిన అయిదు నిమిషాలకే కువైట్‌ జంట విడాకులు తీసుకుని సరి కొత్త రికార్డు సృష్టించారు.ఇండియాలో మాత్రం పెళ్లి అయిన సంవత్సరం వరకు విడాకుల ప్రశక్తి ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube