కువైట్ హెచ్చరిక ఈ రూల్ బ్రేక్ చేస్తే...రూ. 13 లక్షలు కట్టాల్సిందేనట..!!!

రూల్స్ విధించాలన్నా, వాటిని అమలు చేయాలన్నా అరబ్బు దేశానికి మరే దేశం సాటి రాదు.సదరు దేశాలు ఒక సారి నిభందనలు విధించిన తరువాత ఎవరైనా బ్రేక్ చేయలన్నా సరే భయపడి పోతారు.

 Kuwait Warning If This Rule Is Broken Rs. 13 Lakhs Have To Be Paid , Kuwait Envi-TeluguStop.com

ఎందుకంటే ఒక్క సారి తప్పు చేసినా సరే అది మొదటి తప్పైనా సరే వారు ఆ నిభందన అతిక్రమణ తాలూకు విధించిన అపరాధ రుసుము కట్టి తీరాల్సిందే లేదంటే జైల్లో చిప్ప కూడు తినాల్సిందే.ఈ పరిస్థితి సామాన్యులకు మాత్రమే కాదు, సమాజంలో ఎలాంటి హోదాలో ఉన్నా సరే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అంటాయి అరబ్బు దేశాలు.

ఇంతకీ ఈ రూల్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే తాజాగా కువైట్ దేశం కొత్త రూల్ అమలు లోకి తీసుకు వచ్చింది.

కువైట్ ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అధారిటి ( EPA ) బహిరంగ ప్రదేశాలలో ధూమపానం తాగడం, నిషేధమని హెచ్చరించింది.

ఈ నిభందన గతంలో కూడా ఉన్నా తాజాగా చట్టంలో మార్పులు చేస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.EPA అధికారి అల్ ఇబ్రహీం తెలిపిన వివరాల ప్రకారం.

సెమీ క్లోజ్డ్, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నిషేధించినట్టుగా వెల్లడించారు.కేవలం పొగాకు మాత్రమే కాదు ఈ కోవలోకి ఎలక్ట్రానిక్ సంభందిత సిగరెట్స్, హుక్కా లు , ఇతరాత్రా ధూమపాన వస్తువులు అన్నిటిపై ఈ నిషేధం అమలులోకి వస్తుందని తెలిపారు.

అలాగే.

ఈ కొత్త చట్టంపై అవగాహన కల్పించడం కోసం కొన్ని వీడియోలను కూడా ప్రదర్శించనున్నట్లుగా తెలిపారు.

కార్మికులు పనిచేసే సంస్థల ముందు, కొన్ని కార్యాలయాలు, ప్రజలు రద్దీగా తిరిగే ప్రదేశాలలో వీడియోలను ప్రదర్శించనున్నారట.అవహాహన కల్పించిన తరువాత కూడా తాము విధించిన నిభందనను అతిక్రమిస్తే వారు అపరాధ రుసుముగా రూ.13 లక్షలు కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube