కువైట్ షాకింగ్ డెసిషన్...కీలక పదవుల నుంచీ ప్రవాసు ఉద్వాసన...!!

ప్రవాస కార్మికులు అత్యధికంగా వెళ్ళే వలస దేశం కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది.తమ దేశాభివృద్దిలో భాగంగా, తమ సొంత ప్రజలకు ఉద్యోగాల కల్పనలో భాగంగా కువైటైజేషన్ ను 2017 లోనే తెరమీదకు తీసుకువచ్చిన కువైట్ ప్రభుత్వం తాజాగా వాటి అమలును గడిచిన ఏడాదిగా వేగవంతం చేస్తోంది.

 Kuwait Shocking Decision Exile From Key Positions , Kuwait, Kuwaitization, Supermarkets, A Co-operative Organization, Civil Service Commission, Ministry Of Social Affairs-TeluguStop.com

ఇప్పటికే పలు రంగాలలో పనిచేస్తున్న ప్రవాస కార్మికులను ఇంటికి సాగనంపిన కువైట్, ప్రభుత్వ, ప్రవైటు రంగాలలో పనిచేస్తున్న వారిని కూడా టార్గెట్ చేసింది.తాజాగా పలు సెక్టార్ల లో కీలక పదవులలో ఉన్న ప్రవాసులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

కువైట్ లో పలు సూపర్ మర్కెట్స్ లో , కో ఆపరేటివ్ సంస్థలలో కీలక భాద్యతలు నిరహిస్తున్న సూపర్ వైజర్లు, మేనేజర్ లపై ఉక్కుపాదం మోపింది.వారిని వారి భాద్యతల నుంచీ తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది.

 Kuwait Shocking Decision Exile From Key Positions , Kuwait, Kuwaitization, Supermarkets, A Co-operative Organization, Civil Service Commission, Ministry Of Social Affairs-కువైట్ షాకింగ్ డెసిషన్#8230;కీలక పదవుల నుంచీ ప్రవాసు ఉద్వాసన#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ భాద్యతలను కువైటైజేషన్ ప్రకారం స్థానిక కువైటీలకు కట్టబెట్టనుందట.కువైట్ వ్యాప్తంగా ఈ ప్రక్రియ వేగవంతంగా జరిగిదని ఎంతో మంది ప్రవాసులు రోడ్డున పడ్డారని అంటున్నారు ప్రవాస కార్మికులు.

కాగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అఫైర్ కు కో ఆపరేటివ్ సంస్థలు అందించిన లెక్కల ప్రకారం.

కువైట్ వ్యాప్తంగా సుమారు 480 మంది ప్రవాసులను కీలక పదవుల నుంచీ తప్పించి ఆ పోస్టులలో కువైటీ లను నియమించినట్టుగా తెలుస్తోంది.

త్వరలో సుమారు 2300 పోస్టుల నుంచీ ప్రవాస కార్మికులను తొలగించే చర్యలు ప్రారంభం కానున్నాయని వీటిని వారి కువైటీల కోసం సిద్దం చేస్తున్నట్టుగా కో ఆపరేటివ్ సంస్థలు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ అఫైర్స్ కు తెలిపాయట ఈ విషయాన్ని సివిల్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.ఇదిలాఉంటే కువైట్ లోని స్థానికులు ఉద్యోగ కల్పన లేకపోవడంతో తాము కూడా ప్రవాసులు చేసే ఉద్యోగాలు చేస్తామని ప్రభుత్వానికి వినతులు ఇవ్వడంతో కువైట్ కువైటైజేషన్ ను తెరమీదకు తీసుకువచ్చిన విషయం విధితమే.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube