కరోనా సంక్షోభం: వలస జనాభాను తగ్గించే యోచనలో కువైట్  

Kuwait Migrants - Telugu Bangladesh, Coronavirus, Gulf Country, India, Kuwait Prime Minister, Migrant Workers, Philipins, Srilanka

ప్రపంచంపై విరుచుకుపడిన కరోనా అన్ని రంగాలపై పెను ప్రభావం చూపుతోంది.ఈ విపత్తు నుంచి బయటపడటానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్ధితి.

 Kuwait Migrants

ప్రస్తుతం వైరస్ భయం కారణంగా అన్ని దేశాల్లో కోట్లమంది ఉద్యోగాలు పొగొట్టుకున్నారు.దీనికి తోడు ఆయా దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో విదేశీయుల ఎంట్రీకి చాలా దేశాలు అనుమతి ఇవ్వడం లేదు.

తాజాగా గల్ఫ్ దేశం కువైట్ వలస జనాభాను తగ్గించుకునే పనిలో పడినట్లుగా తెలుస్తోంది.కరోనా మహమ్మారి విజృంభణ, చమురు ధరల క్షీణత కారణంగా ఏర్పడిన సంక్షోభం కారణంగా దేశంలోని ప్రవాస జనాభాను 30 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తామని కువైట్ ప్రధానమంత్రి వెల్లడించారు.

కరోనా సంక్షోభం: వలస జనాభాను తగ్గించే యోచనలో కువైట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కువైట్‌లోని 4.8 మిలియన్ల జనాభాలో దాదాపు 3.4 మిలియన్ల మంది విదేశీయులు ఉన్నారు.ఈ అసమతుల్యతను పరిష్కరించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.

విదేశీ కార్మికులలో నైపుణ్యం లేనివారి సంఖ్యను తగ్గించడానికి చట్టసభ సభ్యులు కొత్తగా కోటా వ్యవస్థను ప్రతిపాదించారు.దీని ప్రకారం ప్రభుత్వోద్యోగులుగా ఉన్న ప్రవాసుల స్థానంలో కువైట్ జాతీయులనే భర్తీ చేయాలని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే ఈ ప్రతిపాదనను కొందరు నిపుణులు విమర్శిస్తున్నారు.కొన్ని వృత్తులను చేపట్టడానికి కువైట్ జాతీయులు అంతగా ఇష్టపడరని… అలాంటి చోట్ల ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గల్ఫ్ ఆర్ధిక వ్యవస్థలు తమ చమురు సంపద కారణంగా విదేశీ కార్మికులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి.ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం… కువైట్‌లో సుమారు 6,50,000 మంది విదేశీయులు పనిచేస్తున్నారు.వీరిలో ఎక్కువగా ఫిలిప్పీన్స్, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు చెందిన వారే ఉన్నారు.కొన్నేళ్లుగా కువైట్… ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న విదేశీయుల స్థానంలో సొంత పౌరులనే నియమించుకుంటోంది.దీనికి కరోనా వైరస్ మరింత ఊతమిచ్చింది.2019 చివరినాటికి కువైట్ శ్రామిక శక్తిలో 19 శాతం మాత్రమే ప్రైవేట్ రంగంలో ఉన్నారు.మరోవైపు విదేశీ కార్మికులు నివసించే ప్రాంతాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test