ప్రవాసులకు కువైట్ వార్నింగ్...దేశ బహిష్కరణకై కీలక ఆదేశాలు...!!!

భారత్ నుంచీ ఎంతో మంది భారతీయులు విదేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.ఇలా వలసలు వెళ్ళే వారిలో అధిక శాతం మంది అగ్ర రాజ్యం అమెరికా వెళ్తే.

 Kuwait Govt Strong Warning To Expatriates, Arab Countries, Kuwait, Minister She-TeluguStop.com

వలస కార్మికులుగా అత్యధిక శాతం మంది భారతీయులు అరబ్ దేశాలకు వెళ్తూ ఉంటారు.అత్యధికంగా భారతీయులు కువైట్ వైపే మొగ్గు చూపుతుంటారు.

ఎన్నో ఏళ్ళుగా కువైట్ లోనే ఉంటూ అక్కడే ఆర్ధికంగా నిలదొక్కుకుని శాశ్వత నివాసం పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు.ఆ దేశ ఆర్ధిక, సామాజిక అభివృద్ధిలో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది కూడా.

అయితే కువైట్ ప్రభుత్వం మాత్రం ప్రవాసీయులపై అణిచివేత ధోరణులకు పాల్పడుతోందనే విమర్శలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.తమ దేశ ప్రయోజనాలకు, భద్రతకు, గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపై కటినమైన చర్యలు చేపడుతామని హెచ్చరించింది.ప్రవాసులతో జన సమీకరణ చేపట్టి, కువైట్ శాంతి భంద్రతలకు, సాంప్రదాయాలకు విఘాతం కలిగించే ప్రవాసులకు ఇక పై దేశ భాహిష్కరణ విధిస్తామని ఆదేశ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ అల్ అలీ ప్రకటించారు.దేశ భాషిష్కరణపై మంత్రి మండలి సైతం నిర్ణయం తీసుకుందని ఆయ తెలిపారు.

Telugu Arab, Irada Square, Kuwait, Sheikh Al Ali-Telugu NRI

ఇదిలాఉంటే కువైట్ మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటంటే.కువైట్ లో ఉంటున్న ఓ ప్రవాసుడు అక్కడి పఖ్యాట ఇరాదా స్క్వేర్ ప్రాంతంలో ప్రభుత్వన్ని విమర్శిస్తూ , ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరితో కలిసి నిరసన తెలిపాడు దాంతో ఈ ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి షేక్ అల్ అలీ సదరు ప్రవాసుడిని దేశం నుంచీ బహిష్కరించాలని ఆదేశించారు.అంతేకాదు ఇక నుంచీ ఏ ప్రవాసుడు అయినా కువైట్ అంతర్గత విషయాలలో కల్పించుకున్నా ధర్నాలు చేపట్టినా దేశ బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube