కువైట్ సంచలన నిర్ణయం...ఇకపై జైల్ ఫ్రమ్ హోమ్...

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అన్నీ అల్లాడిపోయాయి.ఎన్నో వ్యాపారాలు, సంస్థలు, దివాలా దేశాయి.

 Kuwait Govt Provide Jail From Home For Prisoners , Jail From Home, Kuwait Govt ,-TeluguStop.com

ఇక సాఫ్ట్ వేర్ కంపెనీలు అయితే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించగా దాదాపు అన్ని సంస్థలు అదే దారిలో ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చాయి.చివరికి విద్యార్ధులకు ఇంటి నుంచే క్లాసులు వినేలా వర్చువల్ విధానం ఏర్పాటు చేశారు.

అయితే ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ కువైట్ ఒకడుగు ముందుకు వేసింది.అందరిలా ఆలోచిస్తే ఎలా అనుకుందో ఏమో కానీ తమ జైళ్ళలో ఖైదీలకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి సౌకర్యం కల్పించింది.

ఈ నిభందన అమలులోకి కూడా వచ్చేసిందట.ఏంటి షాక్ తిన్నారా…వివరాలలోకి వెళ్తే.

కువైట్ ప్రభుత్వం తాజాగా జైలు ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ను అమలులోకి తీసుకువచ్చింది.ఉద్యోగులు, విద్యార్ధులు, ఇళ్ళలో ఉండి హాయిగా పనులు చేస్తున్నప్పుడు దొంగలు ఎందుకు జైళ్లలో మగ్గిపోవాలి అనుకుందో ఏమో కానీ జైలు ఫ్రమ్ హోమ్ బిల్లును ఆమోదించింది.

ఈ బిల్లు ప్రకారం దొంతతనం చేసే ఏదన్నా తప్పు చేసి జైలు శిక్ష పడిన వారు ఇకపై హాయిగా ఇంట్లో ఉండే శిక్షను అనుభవించవచ్చునని తెలిపింది.కువైట్ ఈ ప్రకటనతో ఒక్క సారిగా షాక్ తింది ప్రపంచ దేశం.అయితే

జైలు శిక్ష పడిన ప్రతీ ఒక్కరికీ ఈ జైలు ఫ్రమ్ హోమ్ వర్తించదట అందుకు కూడా కొన్ని కండిషన్స్ అప్ప్లై అంటోంది ప్రభుత్వం.3 ఏళ్ళ కంటే తక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలకు మాత్రమే ఈ జైలు ఫ్రమ్ హోమ్ వర్తిస్తుందట.ఈ విషయంలో ఎలాంటి నిభందనలు అమలు చేస్తారంటే.జైలు ఫ్రమ్ హోమ్ లో ఉండే ఖైదీల కాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ ఏర్పాటు చేస్తారట.ఈ క్రమంలో వారు ఇంట్లో ఉన్నారా లేరా ఉంటె ఎంత సమయం జైలు జీవితం గడుపుతున్నారు అనే విషయాలు లెక్కిస్తారట.ఈ విధానం ప్రతిపాదనకు వచ్చిన తరువాత అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని ప్రకటించింది ప్రభుత్వం.

ఇంతకీ ఈ విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం ఖైదీలకు మానవత్వంతో కూడిన సేవలు అందించాలనుకోవడమేనట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube