సిద్దంగా ఉండండి...ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కువైట్..!!

ప్రతీ మనిషి, ప్రతీ దేశం పరిస్థితి కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్టుగా మారిపోయింది.భారత్ నుంచీ దేశం కాని దేశం వెళ్లి అక్కడ అధిక మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు అనుకున్న ఎంతో మంది కువైట్ వంటి దేశాలకు కార్మికులుగా వలసలు వెళ్ళారు.

 Kuwait Good News To Indian Nris-TeluguStop.com

అయితే కరోనా రాకమునుపు ఎంతో సంతోషంగా గడిపిన ఆయా కుటుంభాలు, కరోనా వచ్చిన తరువాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి.ఉద్యోగాలు కోల్పోవడంతో ఎంతో మంది తిరిగి భారత్ కు వచ్చేశారు, మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కరోనా ఆంక్షల నేపధ్యంలో ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది.

దాంతో ఆర్ధికంగా ఎన్నో కుటుంభాలు రోడ్డున పడ్డాయి.

ఈ నేపధ్యంలో కువైట్ వలస వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది.

కరోనా మహమ్మారి ఉద్రుతమైన సమయంలో ఆంక్షలు విధించాము అయితే ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడటంతో తమదేశంలోకి వలస వాసులు వచ్చేలా కమర్షియల్ విమానాలపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తున్నామని ప్రకటించింది.భారత్, ఈజిప్ట్ , బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ ల నుంచీ వలస వాసులు వచ్చేలా అనుమతులు జారీ చేసేలా ప్రణాలికలు సిద్దం చేసింది.

ఈ విషయంపై కొద్ది రోజుల్లోనే ప్రకటన విడుదల అవుతుందని అంటున్నారు అధికారులు.

అయితే వలస వాసులను ఎప్పటి నుంచీ అనుమతించాలి అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.

ఇదిలాఉంటే కువైట్ వంటి దేశాలకు ప్రపంచ నలుమూలల నుంచీ వలస వాసులు వచ్చినా అత్యధికంగా భారత్ నుంచీ వెళ్ళే వారే ఉంటారు.దాంతో భారత్ లోని వలస వాసులు ఎప్పుడెప్పుడు కువైట్ అనుమతులు ఆత్రుగా ఎదురు చూస్తున్నారు.

కువైట్ లో ఉద్యోగాలు చేసే వారిలో దాదాపు 70 శాతం మంది విదేశీయులే ఉన్నారని, తాజా నిర్ణయంతో వీరందరూ ఒకే సారి వచ్చేసే అవకాశాలు ఉంటాయి.కానీ కువైట్ వలస వాసుల ప్రయాణ నిభంధనల ప్రకారం రోజుకు కేవలం 7500 మందిని మాత్రమే కువైట్ లోకి అనుమతిస్తారు.

ఈ క్రమంలో ఈ నిభందన మార్చి ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు ఇవ్వాలని ప్రవాస సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube