భారత ప్రవాసులకు కువైట్ గుడ్ న్యూస్..ఇకపై....!!!

ప్రవాస కార్మికులకు కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.ఇకపై తమ దేశంలోకి వర్క్ వీసా ద్వారా రావాలనుకునే వారు నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని కేవలం 10 రోజుల్లోనే వర్క్ వీసా అందిస్తామని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.

 Kuwait Good News For Indian Diaspora More ,  Government Of Kuwait, Indian Diaspo-TeluguStop.com

కువైట్ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా భారతీయ ప్రవాస కార్మికులు కువైట్ తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఎందుకంటే అరబ్బు దేశాలకు ప్రపంచ వ్యాప్తంగా వలస వెళ్ళే వారిలో భారతీయ వలస కార్మికులే అత్యధికంగా ఉండటమే అందుకు కారణం.

ఇదిలాఉంటే విదేశాల నుంచీ వచ్చే కార్మికులకు త్వరిత గతిన వర్క్ వీసాలను అందించే ప్రక్రియపై దృష్టి పెట్టిన పబ్లిక్ అధారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వీసాలా జారీ కోసం గతంలో మూడు నుంచీ నాలుగు నెలల సమయం పట్టేదని ఇకపై ఆ సమయం ఉండదని కేవలం 10 రోజుల్లోనే వర్క్ వీసా పర్మిట్లు జారీ చేస్తారని ప్రకటించింది.ఈ నూతన విధానాన్ని డామన్ హెల్త్ ఇన్స్యూరెన్స్ హాస్పిటల్ కంపెనీ సహకారంతో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టుగా ప్రకటించింది.

దీని ప్రకారం.

సదరు కంపెనీ ప్రవాసుల కోసం లేబర్ అవుట్ సోర్సింగ్ దేశాలతో ఆమోదించబడిన ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటుంది.

మెడికల్ పరీక్షలు చేసేందుకే సుమారు 4 రోజులు సమయం పడుతోంది.వలస వాసి సొంత దేశంలో అలాగే వలస వచ్చిన దేశంలో రెండు రోజుల పాటు ఈ ప్రక్రియ జరుగుతున్న నేపధ్యంలో వీసా ప్రక్రియ వేగంగా జరగడం లేదు అందుకే వైద్య పరీక్షల ప్రక్రియ వేగవంతం చేసేందుకు కొత్త యంత్రాంగాన్ని నియమించుకునే విధంగా కసరత్తులు చేస్తోంది.

ఈ ప్రక్రియ అమలయితే మాత్రం కేవలం 10 రోజుల్లో వర్క్ వీసా అందుతుంది.అయితే వైద్య పరీక్షలు వేగవంతం అవడంతో పాటు వీసా త్వరగా రావడం కారణంగా ఫీజులు కూడా గతంలో కంటే ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోందని పబ్లిక్ అధారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube