గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కువైట్....ఈ రెండు రంగాల్లో జాబు చేస్తున్న వలసదారులకు లబ్ది..

కరోన ప్రభావం వలన విదేశీయుల రాకపై అన్ని దేశాలు నిషేధం విధించాయి.వేరే దేశాలకు వలసదారులుగా వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ నిషేధం పెద్ద సమస్యగా మారింది.

 Kuwait Gives The Green Signal , Foreigners, Kuwait, School Directors, Assistant-TeluguStop.com

తిరిగి వెళ్లి వారి వారి పనులు చేసుకోవడానికి అవకాశం లేకపోవటం తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోన కాస్త తగ్గుముఖం పట్టడంతో కువైత్, విదేశీయుల రాకపై నిషేధాన్ని ఎత్తి వేయటంతో పాటు ఇంకొక కీలక నిర్ణయాన్ని కూడా కువైట్ ప్రకటించింది.

ఏమిటంటే.

రెండు డోసుల వాక్సిన్ తీసుకున్న వలసదారులకు ఆగష్టు 1 నుంచి కువైట్ కు వచ్చేందుకు అనుమతిని ఇచ్చించి.

అదే క్రమంలో విజిట్ వీసాలను జారి చేయటం కూడా ప్రారంభించింది.ఆరోగ్య , విద్య రంగాల్లో పని చేసే ప్రవాసీయులు వారిపై ఆధారపడిన వారిని(భాగస్వామి,పిల్లలు, తల్లితండ్రులు) కూడా విజిట్ వీసాపై కువైత్ కు తెచ్చుకోవచ్చని చెప్పింది అక్కడి ప్రభుత్వం.

అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న వైద్యులు, నర్సుల 16 ఏళ్ళ లోపు పిల్లలు ఫ్యామిలీ వీసాలపై వెళ్ళవచ్చు.వైద్యులు, నర్సుల భర్తలు టూరిస్ట్ వీసాపై వెళ్ళవచ్చు, కాని తరువాత వారు ఫ్యామిలీ వీసాకు అప్లై చేయబోమని అఫ్ఫిడివిట్ ఇవ్వవలసి ఉంటుంది.

అలాగే పారమేడికల్ స్టాఫ్ భార్య,పిల్లలు టూరిస్ట్ వీసాపై వెళ్ళటానికి అనుమతి దొరికింది.

అదేక్రమంలో ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారు తమ ఇగ్మ ను మార్చబోమని అఫ్ఫిడివిట్ ఇస్తూ తమ భార్య, పిల్లలను విజిట్ వీసాలపై కువైట్ రప్పించుకోవచ్చు.

ఇక స్కూల్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ నిభందలకు లోబడి తమ 16 ఏళ్ళ లోపు పిల్లలను కువైట్ తీసుకెళ్ళవచ్చు.ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్లనిచేస్తున్న వారు తమ భార్యా, పిల్లలను ఉపాధి వీసాపై తీసుకెళ్ళవచ్చు.

రెసిడెన్స్ పర్మిట్ లేని వారు మాత్రం కంపనీ పేరు మీద ఇచ్చే కమర్షియల్ విజిట్ వీసాపై కువైత్ వెళ్ళవచ్చు, కాని వీరు ఫ్యామిలీ వీసాకు మారే సమయంలో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం అఫ్ఫిడివిట్ అందచేయాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube