కుళ్ళు కువైట్..ప్రవాసులపై ఇంత వివక్షా...!!!

వివిధ దేశాల నుంచీ కువైట్ వెళ్లి అక్కడ పనిచేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.ముఖ్యంగా భారత్ నుంచీ వెళ్లి పనిచేసే వారే కువైట్ లో అత్యధికంగా ఉంటారు.

 Kuwait Given Vaccine For Only Locals Not For Imigrant-TeluguStop.com

కరోనా కారణంగా ప్రవాసుల ఎంట్రీ పై ఆంక్షలు విధించిన కువైట్ ప్రభుత్వం, కరోనా సెకండ్ వేవ్ తమపై ప్రభావం చూపకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.కువైట్ లో వయసు, అనారోగ్యం తదితర విషయాలను దృష్టిలో పెట్టుకున్న కువైట్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

అయితే దేశంలో ఉన్న వారందరికీ వ్యాక్సిన్ అందిస్తామని చెప్పిన కువైట్ ప్రభుత్వం ఇప్పుడు తన వక్ర బుద్దిని చూపిస్తోంది.కేవలం కువైట్ వాసులకే అధిక ప్రాధాన్యతను ఇస్తూ వలస వాసులకు మొండి చేయి చూపిస్తోంది.

 Kuwait Given Vaccine For Only Locals Not For Imigrant-కుళ్ళు కువైట్..ప్రవాసులపై ఇంత వివక్షా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వలస వెళ్ళిన వారిలో వృద్దులు, మహిళలు అనారోగ్యం పాలైన వారు ఉన్నా వారికి అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు వలస వాసులు.టీకా దరఖాస్తులు పరిశీలనలోకి వచ్చినపుడు వారు వలస వాసులైతే దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నాయని వాపోతున్నారు.

కువైట్ అభివృద్దిలో ఎన్నో ఏళ్ళుగా అంతర్భాగంగా వారి పిల్లల సంరక్షణలో, భవన నిర్మాణాలలో , కీలక పదవులలో ఉన్న ఎంతో మంది వలస వాసులకు కువైట్ ప్రభుత్వ తీరు మింగుడు పడటం లేదు.వలస వాసులపై ఇంత వివక్ష ఎందుకు అంటూ ఆవేదన చెందుతున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే కువైట్ లో సుమారు 70 శాతం వలస వాసుల సేవలే ఉపయోగపడుతున్నాయి.అలాంటి వారిని వ్యాక్సినేషన్ కు దూరంగా ఉంచడం ఎంతో దారుణమైన విషయం.

వృద్దులకు, అనారోగ్యంగా ఉన్న వారికి చిన్న పిల్లలకు వ్యాక్సిన్ లో ముందు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం వారి ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ అందించడం పై సర్వాత్ర విమర్శలు వస్తున్నాయి.

#Kuwait #In Child Care

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు