మరింత కటినంగా కువైట్ రూల్స్.... పర్మిట్ గడువు ముగిసిన వారిపై ఉక్కుపాదం..!!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు పలు దేశాలకు వలసలు వెళ్ళడం పరిపాటే, అక్కడి ఆర్ధిక పరిస్థితుల కారణంగానో లేక, ఎక్కువ పని సమయాలు, చేసే పనికి ఎక్కువగా డబ్బులు రావడం ఇలా ఎన్నో కారణాల వలన వలసలు వెళ్తూ ఉంటారు.అలా కువైట్ వలస వెళ్ళే దేశాల భారత్ అగ్ర స్థానంలో ఉంది.

 Kuwait Establish Ministerial Committee For Non Permitted Residents , Kuwait, Ind-TeluguStop.com

కువైట్ సైతం భారత్ నుంచీ వచ్చే వలస వాసులను ప్రోశ్చాహించేది.అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా కువైట్ సైతం అమెరికాలా తమ దేశంలో ఉండే వలస వాసులపై ఉక్కు పాదం మోపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

గతంలో కువైట్ దేశంలో ప్రజలు ప్రస్తుతం వలస వాసులు చేస్తున్న పనులు చేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు.కానీ ఆర్దిక అవసరాల దృష్ట్యా పరిస్థితులు మారండంతో వలస వాసులు చేసే పనులు తాము కూడా చేస్తామని, మాకు అవకాశాలు కల్పించమని తమ ప్రభుత్వంపై ఒత్తిడిలు తీసుకువచ్చారు.

ఈ నేపధ్యంలో కువైట్ ప్రభుత్వం వలస వాసులను తమ దేశం నుంచీ తరిమికొట్టే ప్రయత్నాలను సిద్దం చేసింది.

అందులో భాగంగానే కువైట్ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసులను ఇంటికి సాగనంపేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీను కూడా ఏర్పాటు చేసింది.

జలీబ్ అల్ ఆధ్వర్యంలో కువైట్ మినిస్టీరియల్ కమిటి సిద్దమవుతోంది.కేవలం పర్మిట్ ముగిసిన వారిని మాత్రమే కాదు లైసెన్స్ లేకుండా పనిచేస్తున్న కార్మికులు, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫుడ్ మర్కెట్స్ పై కూడా తీవ్రంగా దృష్టి సారించింది.

త్వరలో అక్రమంగా ఉన్న వలస వాసులపై, ఫుడ్ మర్కెట్స్ పై ఉక్కు పాదం మోపేందుకు సిద్దమయ్యిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube