ఆ దేశంలో 77 పాజిటివ్ కేసుల్లో..60 మంది భారతీయులే..!

కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అన్నీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.భారత్ మినహా అన్నిదేశాలలో పరిస్థితి దారుణంగా నెలకొంది.

 Kuwait, Indians, Corona Positive, Corona Effect-TeluguStop.com

ముఖ్యంగా వలసలని అత్యధికంగా ప్రోశ్చాహాన్ని ఇచ్చే దేశాలలో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్టుగా తెలుస్తోంది.దాంతో ప్రపంచ దేశాలన్నీ వలస వాసులపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.

ఈ క్రమంలోనే ఎంతో మంది వలస వాసులకి కరోనా సోకడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు.తాజాగా కువైట్ దేశంలో ఒక్క రోజులోనే 77 కేసులు పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.

కువైట్ లో గడించిన 24 గంటలలో సుమారు 77 కేసులు పాజిటివ్ కేసులుగా నమోదు కాగా వారిలో సుమారు 60 మంది భారతీయులేనని తేలింది.ఈ విషయాన్ని అక్కడి ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ అబ్దుల్లా ప్రకటించారు.

ఓ కువైట్ దేశస్తుడు ఫ్రాన్స్ వెళ్ళిన కారణంగా ఈ వైరస్ సోకిందని అంటున్నారు వైద్యులు.ఈ వైరస్ సోకినా వారిలో భారతీయులు మాత్రమే కాక పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈజిప్ట్, ఇరాన్ కి చెందిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

కువైట్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 556 కేసులు నమోదు కాగా 456 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.99 మంది పూర్తిగా కోలుకున్నారని 17 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.ఇదిలాఉంటే నిన్నటి రోజున కువైట్ లో తొలి కరోనా మరణం నమోదు కాగా చనిపోయిన వ్యక్తి భారతీయుడు కావడం గమనార్హం.ఈ నేపధ్యంలో కువైట్ ప్రభుత్వం కేసుల సంఖ్య పెరగకుండా తక్షణ నివారణ చర్యలు చేపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube