ప్రవాసుల దేశ బహిష్కరణకు రంగం సిద్దం....ప్రవాస ఎంబసీ లకు లేఖలు...

దేశం కాని దేశం ఉద్యోగానికి వెళ్లి అక్కడ ఏళ్ళ తరబడి ఉద్యోగం చేసిన తరువాత ఒక్కసారిగా అక్కడి నుంచి ఉద్యోగాలు కోల్పోయి, సుదీర్ఘ కాలం చేస్తున్న ఉద్యోగాలు పోగొట్టుకుని మళ్ళీ తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్ళిపోయే పరిస్థితులు రావడం అనేది ప్రవాసులకు మింగుడు పడని విషయం.ప్రస్తుతం ఇలాంటి సమస్యనే కువైట్ లోని ప్రవాసులు ఎదుర్కుంటున్నారు.

 Kuwait To Deport Illegal Expats,kuwait,illegal Expats,kuwait Rules,dna Test,kuwa-TeluguStop.com

కువైట్ తమ దేశంలో అనధికారికంగా ఉంటున్న ప్రవాసులను బలవంతంగా వెళ్ళ గొట్టే ప్రయత్నంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.అందులో భాగంగా…

ప్రవాసుల ఎంబసీ కార్యాలయాలకు తాము తొలగిస్తున్న వారి వివరాలు పంపుతూ వారు వారి ప్రాంతాలకు వెళ్ళేలా అన్ని రకాల చర్యలు సిద్దం చేయాలని, త్వరిత గతిన పంపేయాలని కోరిందట.

ఇంతకీ ఎందుకు కువైట్ ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందంటే.కువైట్ లో ఉంటూ తమ దేశ నిభందనలు పాటించని వారు, పలు రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వారు, అలాగే రెసిడెన్సీ పత్రాలు లేకుండా కువైట్ లో ఉంటున్న వారు, రెసిడెన్సీ గడువు అయిపోయిన తరువాత కూడా కువైట్ లోనే ఉంటున్న వారిపై తాజాగా చర్యలు చేపడుతోంది.

ఈ క్రమంలోనే

కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ విదేశాంగ శాఖ ద్వారా కొన్ని కీలక సూచనలు చేసింది.అనర్హులుగా ఉన్న వారిపై వేటు వేయాలని వారి వారి ఎంబసీ లకు పేర్లు పంపి వారిని దేశం నుంచీ పంపేందుకు అన్ని రకాల ఏర్పాటు చర్యలు చేపట్టాలని, ఉల్లంఘన దారులు తప్పకుండా జరిమానాలు చెల్లించాలని అలాంటి వారినే దేశం నుంచీ పంపేయాలని ఒక వేళ వారు జరిమానా చెల్లించలేని పరిస్థితులో ఉంటే వారి స్పాన్సర్ లు ఆ జరిమానాలను చెల్లించాలని తెలిపింది.

అంతేకాదు కొందరు ప్రవాసుల పిల్లలకు వారు తల్లి తండ్రులు ఎవరో కూడా తెలియకుండా ఉన్నారని అలాంటి వారు ఎంతో మంది ఉన్నారని అందుకే డీఎన్ ఏ టెస్ట్ ల ద్వారా వారి తల్లి తండ్రులను గుర్తించాలని అధికారులను ఆదేశించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube