రూమ్ లో అడ్జస్ట్ అవుతారా అన్నారు.. నటి షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఈ రంగానికే పరిమితం అయిన వాళ్లు చెబుతారు.పలువురు సినీ ప్రముఖులు సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు మెదిపి తమ మనస్సులోని అభిప్రాయాలను పంచుకున్న సందర్భాలు ఉన్నాయి.

 Kutti Padmini Comments About Casting Couch Goes Viral In Social Media Details, K-TeluguStop.com

అయితే ప్రముఖ నటి కుట్టి పద్మిని తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించారు.

సౌత్ ఇండియాలోని సీనియర్ నటీమణులలో ఒకరైన ఈ నటి తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించారు.

పలు హిందీ సినిమాలలో కూడా కుట్టి పద్మిని మెరిశారు.అయితే ఈతరం ప్రేక్షకులలో చాలామందికి ఆమె గురించి ఎక్కువగా తెలియదు.తమిళ సినిమాలో బాల నటిగా ఈ నటి కెరీర్ మొదలైంది.ఆ తర్వాత కాలంలో ఈ నటి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడీగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

Telugu Actresskutti, Directors, Kutti Padmini, Sractress, Sri Devi, Tollywood-Mo

నాకు 16 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో డైరెక్టర్లు అడ్జస్ట్మెంట్లు ఇస్తారా అని అడిగారని ఆమె తెలిపారు.అలా చేయడం నాకు ఇష్టం లేదని అదే సమయంలో గ్లామర్ డ్రెస్ లు వేసుకోవాలని నేను అనుకోలేదని కుట్టి పద్మిని పేర్కొన్నారు.నాకు డ్రామా అంటే ఇష్టమని కొన్ని డ్రెస్సులు నాకు నచ్చవని ఆమె తెలిపారు.నాకంటే శ్రీదేవి పాపులర్ అయిందని ఆ లక్ నాకు రాలేదని ఆమె అన్నారు.

Telugu Actresskutti, Directors, Kutti Padmini, Sractress, Sri Devi, Tollywood-Mo

ప్రస్తుతం నేను 140 మందికి జీతాలు ఇస్తున్నానని నాకు అవకాశం ఇవ్వని వాళ్లకు సైతం ఉపాధి కల్పించానని కుట్టి పద్మిని కామెంట్లు చేశారు.నేను చేసిన పనుల వల్లే నేను బాగున్నానని ఆమె పేర్కొన్నారు.నేను ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నానని ఒంటరిగా ఉన్నప్పటికీ సంతోషంగా ఉన్నానని కుట్టి పద్మిని తెలిపారు.కుట్టి పద్మిని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube