నెట్టింట వైరల్ అవుతున్న ఖుష్బూ ఫొటోస్..

తెలుగు సినీ నటి ఖుష్బూ గురించి అందరికీ పరిచయమే.తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Kushboo Sundar With Her Daughters Latest Pics Goes Viral-TeluguStop.com

నటిగానే కాకుండా రాజకీయ నాయకురాలిగా బీజేపీ పార్టీలో ఉంటూ తన వంతు బాధ్యతలను చేపట్టుతుంది.తన వ్యక్తిగత పట్ల కూడా మంచి అభిమానాన్ని అందుకుంది.

తమిళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఖుష్బూ.

 Kushboo Sundar With Her Daughters Latest Pics Goes Viral-నెట్టింట వైరల్ అవుతున్న ఖుష్బూ ఫొటోస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంకటేష్ నటించిన కలియుగ పాండవులు సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది.

గతంలో కొన్ని ఏళ్లపాటు సినిమాలకు దూరమైన ఖుష్బూ మళ్లీ రీ ఎంట్రీ తో అవకాశాలు అందుకుంది.వయసుకు తగ్గ పాత్రలతో మెప్పిస్తుంది.1997లో సుందర్ సి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా తనకు అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ నిత్యం తన ఫోటోలను, తన ఫ్యామిలీ ఫోటోలు బాగా పంచుకుంటుంది.

అంతేకాకుండా కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.ఇక తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోలను పంచుకుంది.ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా.తన కూతురిని చూసిన నెటిజన్లు అప్సరసలా మారింది అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.పైగా ఖుష్బూ కంటే అందంగా ఉందని అంటున్నారు.

కానీ మూడు సంవత్సరాల కిందట ఖుష్బూ తన సోషల్ మీడియా వేదికగా తనతో పాటు తన కూతుర్లు ఉన్న ఫోటోను పంచుకోగా.ఆ ఫోటోకి బేబీ డాల్ అని క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేసింది ఖుష్బూ.అందులో తన కూతురు చాలా లావుగా కనిపించగా.

ఆ పోస్ట్ కు ఓ నెటిజన్ నెగటివ్ కామెంట్స్ చేశాడు.ఇక ఆ కామెంట్ కి సీరియస్ అయిన ఆమె గట్టిగా స్పందించింది.

ఇక ఈ కామెంట్ కు మరో సీనియర్ నటి రాధిక కూడా స్పందించి వీళ్లంతా ఇంటర్నెట్ సైకోలు అని మండిపడింది.అలాంటిది ఒకప్పుడు అలా ఉండే తన కూతురు ఇప్పుడు సన్నగా, అందంగా కనిపించి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

#KushbooSundar #Glamoros #Baby Doll #Kushboo Sundar #KushbooSundar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు