అర్జున్‌ ఆడవారిని కాపాడే వ్యక్తి.. అలా చేసే వ్యక్తి కాదు   Kushboo Dennis Rumors About Arjun     2018-10-24   09:35:05  IST  Ramesh P

సౌత్‌లో స్టార్‌ హీరో అయిన అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో ప్రకంపనుల రేపుతున్నాయి. అర్జున్‌కు వ్యతిరేకంగా ఉండేవారు అంతా కూడా శృతి హరిహరన్‌కు మద్దతు తెలుపుతూ అర్జున్‌ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్‌ రాజ్‌, హీరోయిన్‌ శ్రద్దా ఇంకా పలువురు కూడా అర్జున్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటూ ఆయన క్షమాపణలు చెప్పాలిందిగా సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేసిన విషయం తెల్సిందే. మరో వైపు అర్జున్‌కు మద్దతు పెరుగుతూనే ఉంది.

అర్జున్‌ అలాంటి వాడు కాదని పలువురు దర్శకులు ఇప్పటికే ప్రకటించారు. ఆయన కూతురు, తల్లి కూడా హీరోయిన్‌ శృతి హరిహరన్‌ చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జున్‌ అలాంటి వ్యక్తి కాదని వారు బలంగా వాదిస్తున్నారు. ఈ సమయంలోనే అర్జున్‌ తో ఎన్నో చిత్రాల్లో నటించి, ఆయనకు మంచి స్నేహితురాలు అయిన ఖుష్బూ స్పందించింది. ఇలాంటి వ్యవహారంలో అర్జున్‌ పేరు వస్తుందని తాను ఎప్పుడు అనుకోలేదు. అర్జున్‌ వంటి మంచి వ్యక్తిని ఇలాంటి వివాదంలోకి లాగడం చాలా బాధాకరంగా ఉందని ఈ సందర్బంగా ఖుష్బూ చెప్పుకొచ్చింది.

ఖుష్బూ ఇంకా మాట్లాడుతూ.. నాకు అర్జున్‌ 35 ఏళ్లుగా తొసు. 20 ఏళ్లుగా ఆయన ఎంతో మంది హీరోయిన్స్‌గా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఏ ఒక్కరు ఆయన గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఒక హీరోయిన్‌ విమర్శలు చేస్తుంది అంటే వెంటనే ఆయనపై ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు. ఆయన గురించి హీరోయిన్‌ చేసిన విమర్శల్లో నిజా నిజాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయించుకోవాలంటూ ఖుష్బూ సలహా ఇచ్చింది.

Kushboo Dennis Rumors About Arjun-

షూటింగ్స్‌ సమయంలో కొన్ని వందల మంది మీదకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నన్ను ఎన్నో సార్లు అర్జున్‌ కాపాడాడు. అలాంటి వ్యక్తి ఇలా చేశాడంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, ఆయనకు తాను మద్దతుగా నిలుస్తున్నాను అంటూ ప్రకటించింది. మీటూ ఉద్యమంకు మద్దతుగా నిలుస్తాను అంటూనే అర్జున్‌ అటువంటి వ్యక్తి కాదు, అర్జున్‌కే తన మద్దతు అంటూ ప్రకటించింది.