40 ఏళ్లుగా కాఫి మాత్రమే ఆమె ఆహారం...ఏ ఆహార పదార్దాలు తీస్కోకపోయినా ఆరోగ్యంగా,యాక్టివ్ గా...

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్,మధ్యాహ్నం కడుపునిండా భోజనం,సాయంత్రం స్నాక్స్,రాత్రికి డిన్నర్.మధ్యమధ్యలో ఏవో ఒకటి కడుపులో పడేయడం.

 Kurnool Woman Living Only On Coffee For 40 Yrs-TeluguStop.com

ఇది ఒక సాధారణ మనిషి భోజనశైలి.కాని ఇవేవి లేకుండా కేవలం ఒకే ఒక ద్రవపదార్దాన్ని కొన్నేళ్లుగా ఆహారంగా తీసుకుంటున్నవారిని చూసారా.

అది కూడా శక్తి కోసం ఏ అమృతమో ,వీరమాచినేనో,మంతెనో చెప్పిన డైట్ ప్లాన్లోని లిక్విడ్ కాదు.మనం నిత్యం తాగే కాఫి మాత్రమే.

అవును 40ఏళ్లుగా కేవలం కాఫి మాత్రమే తాగుతూ బతుకుతున్నారు విజయలక్ష్మి.

కర్నూలు కి చెందిన 53ఏళ్ల విజయలక్ష్మమ్మ మరే ఇతర ఆహారపదార్ధాలు తీస్కోకుండా 40ఏళ్లుగా కాఫి తాగుతూ బతికేస్తున్నారు.ఐదోతరగతి వరకు సొంతూరులో చదువుకున్న విజయలక్ష్మి హైస్కూల్ చదువుకు పక్కూరికి వెళ్లాల్సి వచ్చింది.దాంతో రోజు ఉదయాన్నే స్కూలుకి క్యారేజి పట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం కష్టమై,ఉదయం ఇంట్లో కాఫి తాగి స్కూలు కి వెళ్లిపోయేది.

అలా కాఫికి అలవాటు పడిన విజయలక్ష్మి భవిష్యత్లో కేవలం కాఫి తాగుతూనే బతుకుతానని ఊహించి ఉండరు.

పెళ్లి వయసు వచ్చాక తన కాఫి విషయం దాచిపెట్టి పెళ్లిచేశారు.

పెళ్లి తర్వాత విషయం తెలుసుకున్న భర్త తన చేత ఇతర ఆహారపదార్దాలు తినిపించాలని చూస్తే ఆమెకి ఇబ్బందిగా ఉండేది.దాంతో డాక్టర్ల చేత చెకప్ చేయిస్తే ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఆటంకం లేదని,ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలిలా ఉన్నారని తేల్చారు.

దాంతో భర్త కూడా ఆమె కాఫి అలవాటుని అలవాటు చేసుకున్నారు.కాని బయటి వారు మాత్రం ఆమె కేవలం కాఫి మాత్రమే తాగడాన్ని చూసి కొంచెం ఆశ్చర్యపోతుంటారు.ఎందుకంటే ఆమె కాఫీ తాగి ఓ మూల పడుకుంటారనుకుంటే పొరపాటు.!…ఆమె అలా కాదు భర్త అవసరాలు కనిపెట్టి అన్నింటిని అమర్చి పెట్టే ఒక ఆదర్శ గృహిణి మాత్రమే కాదు ఒక ఫార్మసీ కాలేజ్ అధిపతి కూడా.ఇంట్లోవాళ్లకి అంటే అలవాటయి పోయింది కాని కాలేజీలో వాళ్లు మాత్రం ఒక్క కాఫీనే తాగి అంత యాక్టివ్ గా ఎలా పనిచేస్తారబ్బా అనేది వారి ఆశ్చర్యానికి కారణం.

విజయలక్ష్మమ్మ రోజూ ఉదయం 5 గంటలకు లేచి తొలి కాఫీ తాగుతారు.ఆ తరువాత నుంచి గంటగంటకీ ఒక పెద్ద కప్పుతో కాఫీ తాగుతారు.ఇలా రోజూ రెండు లీటర్ల పాలతో 20-30 పైగా కప్పుల కాఫీ తాగుతారు.వంట…బాగా చేస్తారు విజయలక్ష్మమ్మకు దైవభక్తి ఎక్కువ.ఉదయం 4 గంటలకే లేచి పూజలు చేస్తారు.

ఆపై భర్తతో కలిసి యోగా చేస్తారు.ఆ తరువాత కాఫీ టిఫిన్, కాఫీ భోజనం ఇలా సాగిపోతుంది.

అయితే నాలుగు దశాబ్ధాలుగా కాఫీ తప్ప ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదు.తాను అన్నం ముట్టకపోయినా కలెక్టరేట్‌ ప్రజాదర్భార్‌కు వచ్చే వారికి ఉచితంగా భోజనం పెడతారు.

ఎవరైనా అచ్చం కాఫీ నేనా మజ్జిగ తాగితే చలవచేస్తుందని చెప్పి తాగించాలని చూస్తే…మజ్జిగ తాగగానే తనకు కడుపులో మంట వస్తుందని చెప్పారామె.ఈమె ఫంక్షనల్లో కూడా ఏమీ ఆహారం తీసుకోరు…తప్పనిసరై తినాల్సివస్తే ఐస్‌క్రీం తిని వచ్చేస్తారు.

ఇదండీ కాఫి మేడమ్ కహానీ….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube