ఆంధ్రావాసులారా! కాలర్ ఎగరేయండి... మన కర్నూలు అమ్మాయికి ఒలింపిక్ మెడల్!

అవును.ఆమె ఆంధ్రా వాసుల్ని గర్వంగా తలెత్తుకొనేలా చేసింది.

 Kurnool Girl Tennis Player Jafreen Won Bronze Medal In Deaflympics Details, Gold-TeluguStop.com

మనచుట్టూ అన్ని అవయవాలు సరిగ్గా వున్న అనేకమంది ఇప్పటికీ టైం బాలేదనో, అవకాశాలు రాలేదనో లాంటి చేతకాని షాకులు చెబుతూ బతికేస్తూ వుంటారు.కొంతమందికి ఏదో ఒక లోపం వున్నా, పట్టుదలతో ముందుపోతూ, కష్టపడుతూ, అనుకున్నదానిని సాధిస్తూ వుంటారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు.ఆమె అంగవైకల్యం ముందు అంతర్జాతీయ వేదిక సైతం చిన్నబోయింది.

ఆమె ప్రతిభకు ఒలిపింక్ బ్రాంజ్‌ మెడల్‌ దాసోహం అయ్యింది.

ఆటనే ఊపిరిగా పీల్చుతున్న టెన్నిస్‌ ప్లేయర్‌ జాఫ్రీన్‌ ఖాతాలో ఇప్పుడు మరో పతకం వచ్చి చేరింది.

బదిరుల ఒలింపిక్‌(డెఫిలింపిక్స్‌) క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, కర్నూలుకి చెందిన క్రీడాకారిణి సంచలనం సృష్టించింది.టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రీన్‌ కాంస్య పతకం సాధించింది.మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్‌ దూబే జంటను ఓడించింది.ఈ రికార్డుతో భారత్‌ 1993లో తనకున్న అత్యధిక పతకాల రికార్డులను తిరగరాసింది.

బ్రాంజ్ మెడల్ సాధించిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన షేక్ జాఫ్రిన్ ఒకరు.

Telugu Andhra Pradesh, Bhavani Kedia, Bronze Medal, Deaflym, Gold Medal, Jafreen

7 సెప్టెంబర్‌ 1997న షేక్‌ జాఫ్రిన్‌ కర్నూలులో జన్మించింది.ఆమె పుట్టుకతోనే బధిరురాలు.కానీ, జాఫ్రిన్‌ మూడేళ్ల వయసులో ఆమెకు మూగ, చెవుడు అని తల్లిదండ్రులు గుర్తించారు.

అయినా నిరాశ చెందకుండా.ఆమెలోని ప్రతిభకు తోడయ్యారు.

తండ్రి జాకీర్‌ వృత్తి రిత్యా అడ్వకేట్‌.జాఫ్రిన్‌కు తనలోని లోపాలను మరిచిపోయేలా, అందరిలా స్కూల్‌కు పంపారు.

ఆమెకు చిన్నతనంలోనే టెన్నిస్‌పై ఆసక్తి ఉందని తెలుసుకుని ప్రత్యేక ట్రైనింగ్‌ ఇప్పించాలనుకున్నారు.దీంతో 8 ఏళ్ళ ప్రాయంలోనే టెన్నిస్ రాకెట్‌ పట్టుకుని కోర్టులో అడుపెట్టింది.

కర్నూలులో నివాసం ఉంటున్న జాఫ్రీన్‌ తండ్రికి తన కూతురిని టెన్నిస్‌ క్రీడాకారిణిగా చూడాలన్న కోరికను ఆమె తీర్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube