కుప్పం కు ఎన్టీఆర్ ? గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాబు ?

చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వేస్తూనే ఉంది.ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారని, చంద్రబాబు వయసు రీత్యా ఇక విశ్రాంతి తీసుకుంటారని, లోకేష్ ఒక్కడే పార్టీని ముందుకు నడిపించలేడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

 Kuppam Tdp Leaders Demand On Jr Ntr Kuppam Constency Camphain-TeluguStop.com

అయితే ఎక్కడా ఈ వ్యవహారంపై చంద్రబాబు, లోకేష్ గాని, జూనియర్ ఎన్టీఆర్ గానీ స్పందించలేదు.అసలు ఈ వ్యవహారం తెరపైకి రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతూనే వస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతింది.ఎక్కువ స్థానాలను వైసిపి గెలుచుకుంది.

 Kuppam Tdp Leaders Demand On Jr Ntr Kuppam Constency Camphain-కుప్పం కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాబు -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చంద్రబాబు చాలా కాలంగా పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్న కంచుకోట అయిన కుప్పం నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికలలో బాగా దెబ్బతింది.ఇక్కడ 89 పంచాయతీలు ఉండగా వైసీపీ మద్దతుదారులు 75 స్థానాలను గెలుచుకున్నారు.

Telugu Ap, Balayya, Chandrababu, Jagan, Jr Ntr, Kuppam, Lokesh, Nandamuri Hero, Tarak, Tdp, Young Tiger Ntr, Ysrcp-Telugu Political News

తెలుగుదేశం పార్టీకి కేవలం 13 మాత్రమే దక్కడంతో, చంద్రబాబు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పరిస్థితి చేజారిపోతుంది అనుకుంటున్న పరిస్థితుల్లో అక్కడ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు నడుంబిగించారు.నిన్నా, ఈ రోజు బాబు ఆ నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు.తాజాగా కుప్పం, శాంతిపురం మండలాల్లో చంద్రబాబు పర్యటించారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమివ్వడంతో రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది.బాబు శాంతిపురం లో పర్యటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా కుప్పంలో ప్రచారానికి రావాలని, ఆయన్ను ప్రచారంలోకి దింపాలి అంటూ కొంతమంది అభిమానులు బాబును డిమాండ్ చేశారు.

దీనికి ఏం చెప్పాలో తెలియని సందిగ్ధంలో చంద్రబాబు నవ్వుతూనే , వారి డిమాండ్ తీరుస్తాను అన్నట్లుగా తల ఊపడంతో మరింత ఉత్సాహం గా జూనియర్ ఎన్టీఆర్,చంద్రబాబు నినాదాలు టీడీపీ శ్రేణులు చేయడం తో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.అయితే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గతంలో ఎన్నోసార్లు పర్యటించినా, ఎప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాలేదు.

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున దర్శనమివ్వడం, ఆయనను రంగంలోకి దింపాలనే డిమాండ్ పెరగడం వంటి వ్యవహారాలు చూస్తే, ఇప్పుడు టిడిపి ఎదుర్కుంటున్న ఇబ్బందుల దృష్ట్యా, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ పార్టీని గట్టెక్కించ గలరనే నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో మొదలైందా అనే చర్చ జరుగుతోంది.ఏది ఏమైనా బాబుకు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం మాత్రం ఇబ్బందికరంగా మారేలా కనిపిస్తోంది.

#Jagan #Tarak #Chandrababu #Kuppam #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు