ప్రపంచ కప్ లో ఆసీస్ జట్టు సెమీస్ చేరుతుంది అని కామెంట్ చేసిన టీమిండియా మాజీ కోచ్  

Kumble Backs Australia To Make It To The Semi-final Of The World Cup-

ప్రపంచ కప్ దగ్గర పడుతుండడం తో సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ సారి ప్రపంచ కప్ ఉండబోతుంది ఏ జట్టు తుది దశకు చేరుకుంటుంది వంటి పలు అంచనాలు వేయడం మొదలు పెట్టారు.ఈ క్రమంలో నే టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ప్రపంచ కప్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఒక క్రికెట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన కుంబ్లే ప్రపంచ కప్ సెమీస్ లో ఖచ్చితంగా ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కు చేరుతుంది అంటూ వ్యాఖ్యానించారు..

Kumble Backs Australia To Make It To The Semi-final Of The World Cup--Kumble Backs Australia To Make It The Semi-final Of World Cup-

ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రపంచ కప్ లో కూడా ఆసీస్ బాగానే ఆడిందని కావున సెమీస్ వరకు ఆసీస్ జట్టు చేరుతుంది అంటూ కుంబ్లే జోస్యం చెప్పాడు.

అంతేకాకుండా ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీ లలో ఎలా ఆడాలో బాగా తెలిసిన ఆజట్టుకు ఇంగ్లండ్‌లోని పరిస్థితులపై మంచి అవగాహన ఉంది కావున ఆసీస్ కు అవకాశం ఉంది అంటూ కుంబ్లే వ్యాఖ్యానించారు.డేవిడ్ వార్నర్,స్టీవ్ స్మిత్ వంటి అనుభవజ్ఞులు కూడా జట్టులో తిరిగి చేరడం తో ఆ జట్టు సెమీస్ చేరుతుంది అని కుంబ్లే అన్నారు.బాల్ టాంపరింగ్ వివాదం తో ఏడాది పాటు క్రికెట్ కు దూరమైన వార్నర్,స్మిత్ లు మళ్లీ తిరిగి జట్టులో స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కుంబ్లే వారిద్దరూ తిరిగి జట్టులో స్థానం సంపాదించడం తో ఆసీస్ జట్టు మరింత బలంగా మారింది అని కావున సెమీ ఫైనల్ కు ఖచ్చితంగా ఆ జట్టు చేరుతుంది అని కుంబ్లే వివరించాడు.