హీరో యష్ పై సంచలన వాఖ్యలు చేసిన కుమారస్వామి  

హీరో యష్ పై సంచలన వాఖ్యలు చేసిన కుమారస్వామి. .

Kumaraswamy Sensational Comments On Hero Yash-jds,kumaraswamy Sensational Comments,mandya Elections,sumalatha

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. ఇక కర్ణాటక సిఎం కుమారస్వామి తన కొడుకుని ఎలా అయిన ఎంపీ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తన కొడుకు నిఖిల్ ని మాండ్యా నియోజకవర్గంలో సుమలత మీద పోటీకి దించాడు..

హీరో యష్ పై సంచలన వాఖ్యలు చేసిన కుమారస్వామి-Kumaraswamy Sensational Comments On Hero Yash

అయితే ఆ నియోజకవర్గంలో కన్నడ సినీ హీరోలు అందరూ సుమలతకి మద్దతుగా నిలబడటం అక్కడ సంచలనంగా మారింది. కుమారస్వామి ఓ వైపు రాజకీయాలలో ఉంటూనే మరో వైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు సినిమా స్టార్ హీరోలు తనకి కాకుండా సుమలతకి మద్దతుగా నిలబడటం అతనికి భాగా కోపం తెప్పించింది.

ఈ నేపధ్యంలో కన్నడ స్టార్ హీరోలైన యష్, దర్శన్ లపై కుమారస్వామి సంచలన వాఖ్యలు చేసాడు. మాలాంటి నిర్మాతలు లేకపోతే ఈ నటుల జీవితం ముందుకెళ్లదు. యశ్‌ లాంటి నటులు నా పార్టీ సభ్యుల్ని విమర్శిస్తున్నారు.

నా కారణంగా కార్యకర్తలు కామెంట్‌ చేయకుండా మౌనంగా ఉన్నారు. ఇలాంటి నటులతో సినిమాలు తీసేందుకు ఇక నేను ఒప్పుకుంటానన్న నమ్మకం నాకు లేదు. మాలాంటి నిర్మాతలు ఉండటం వల్ల వాళ్లు జీవించగలుగుతున్నారు అని నేరుగా విమర్శలు చేసారు.

మరి కుమారస్వామి వాఖ్యలపై హీరో యష్ ఎలా స్పందిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.