మరింత ముదురుతున్న కర్ణాటక రాజకీయం,రాజీనామా దిశగా కుమారస్వామి  

Kumaraswamy Likely To Resign-

గత కొద్దీ రోజులుగా కర్ణాటక రాజకీయాలలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా లు చేసి ముంబై పారిపోయి మరి భీష్మించుకు కూర్చున్నారు.

Kumaraswamy Likely To Resign--Kumaraswamy Likely To Resign-

రాజీనామా లు చేసిన చాలా మంది ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎం గా కుమార స్వామి వద్దని,కుమార స్వామి తప్ప మరెవరైనా పర్లేదు అంటూ రాజీనామా లు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kumaraswamy Likely To Resign--Kumaraswamy Likely To Resign-

ఇప్పటికే 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టడం తో సంకీర్ణ ప్రభుత్వానికి పూర్తిగా బీటలు వారినట్లు అయ్యింది.కుమార స్వామి ని సీఎం గా ప్రకటించినప్పటి నుంచి కూడా అక్కడ కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల మధ్య పెద్దగా పొత్తు కుదరలేదు అని చెప్పాలి.అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లు సంపాదించడం తో మ్యాజిక్ ఫిగర్ దాటాకపోయినా ఇక అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ కె ఎక్కువ అవకాశాలు కనిపించాయి.

ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించడం తో అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేశారు కానీ కుమార స్వామి ని సీఎం చేయడం పై కాంగ్రెస్ లో కొంత మంది ఎమ్మెల్యేలకు సుతరామం ఇష్టం లేదు.

సరిగ్గా సమయం చూసుకొని అందరూ ఈ విధంగా రాజీనామా బాట పట్టడం తో ఇప్పుడు ఇక కుమార స్వామి గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోపాటు అసమ్మతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న నిర్ణయానికి కుమరస్వామి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆయన బడ్జెట్ సమావేశాలకు ముందే రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిన్న రాత్రి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి మాట్లాడారు కుమారస్వామి, తండ్రి సలహా మేరకే సీఎం పదవికి రాజీనామా చేయాలని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తే బయటి నుంచి మద్దతివ్వాలని జేడీఎస్ నిర్ణియించినట్టు తెలుస్తుంది.

మరోపక్క కర్ణాటక లో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ తెలిపింది.