కుమారస్వామికి పదవీ గండం అంటున్న జ్యోతీష్యులు! బీజేపీ డ్రామా అంటున్న సిఎం  

Kumaraswamy Face Struggles Says Astrologists -

కర్ణాటకలో గత కొద్ది రోజులుగా అస్థిర పాలన నడుస్తుంది.అధికార పక్షం అయిన కాంగ్రెస్- జేడీఎస్ కూటమిని ఎలా అయిన కూలదోసి అధికారం చేపట్టాలని బీజేపీ చూస్తుంది.

Kumaraswamy Face Struggles Says Astrologists

ఇప్పటికే అధికార పక్షం నుంచి 16 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా రిసార్ట్స్ లో దర్జాగా సేద తీరుతున్నారు.ఈ నేపధ్యంలో కుమారస్వామి సర్కార్ విశ్వాస పరీక్షకి సిద్ధం అయ్యింది.

ఈ విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశం లేకపోవడం కుమారస్వామి సర్కార్ అసెంబ్లీ సమావేశాన్ని ప్రతి రోజు వాయిదా వేస్తూ విశ్వాస పరీక్ష జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది.ఇంకా దీనిని మరింత ఆలస్యం చేయాలని కుమారస్వామి యోచిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటకలో మరో వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.కర్ణాటకలో కుమారస్వామి విశ్వాస పరీక్ష ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయంటూ జ్యోతిష్యులు కుమారస్వామిని హెచ్చరించారు.

సాధ్యమైనంత త్వరగా ఈ పరీక్షను ఎదుర్కొంటే కుమారస్వామికి మంచి జరుగుతుందని, లేదంటే ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్పినట్టు కన్నడనాట సోషల్ మీడియాలో ఒక ప్రచారం వైరల్ అవుతుంది.అయితే ఈ ప్రచారాన్ని జేడీఎస్ కొట్టిపారేసింది.

బీజేపీ నేతలు కావాలనే ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.కుమారస్వామికి జ్యోతీష్యం మీద పిచ్చి కారణంగా ఇలాంటి ప్రచారాన్ని తెరమీదకి తీసుకొచ్చారని విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే రైట్ లాగ్ న్యూస్ బ్లాగ్ లో పలువురు జ్యోతిష్యులు, కుమారస్వామి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తూ, ఆయన వెంటనే విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని సూోచించారు.ఆలస్యం చేస్తే అది జేడీఎస్ కు తీరని నష్టాన్ని మిగులుస్తుందని హెచ్చరించారు.

అయితే ఈ విష ప్రచారాన్ని తాము ఎంత మాత్రం విస్వసించమని జేడీఎస్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు