కాబోయే కన్నడ సీ.యం కుమార స్వామి రెండవ భార్య టాప్ హీరోయిన్.. ఆమె ఎవరో చూస్తే షాక్       2018-05-20   22:36:14  IST  Raghu V

ఐపీల్ క్రికెట్ మ్యాచ్ లకన్న కన్నడ ఎన్నికల ఉత్కంఠ భరితంగా సాగాయి , ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడం కర్ణాటక C.M గా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయడం.మూడు రోజుల తర్వాత సరైన బలం లేకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. యడ్యూరప్ప రాజీనామా తరువాత అందరూ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అని ఆలోచనలో పడ్డారు, అదే సమయంలో జేడీఎస్ నేత కాబోయే కర్ణాటక సీఎం కుమారస్వామి వైపు మళ్లింది. కన్నడ ప్రజలందరూ కుమార స్వామి గురించి గూగుల్ లో వెతకడం ప్రారంభించారు , అందులో కుమార స్వామి రెండవ భార్య రాధికా పెరు బయటకి వచ్చింది , మే 18 , 19 తేదీల్లో గూగుల్ సెర్చింగ్ లో ట్రేండింగ్ లిస్ట్ లో ఉండడం విశేషం , దీన్ని బట్టి చెప్పేయచ్చు ఆమె గురించి ఎంత గా సెర్చ్ చేసారో …

కుమార స్వామి రెండవ భార్య టాప్ హీరోయిన్

కుమార‌స్వామి భార్య పేరు రాధికా.ఈమె ఇప్ప‌టివ‌ర‌కు 32 సినిమాల్లో న‌టించ‌డంతో పాటు కొన్ని సినిమాలను కూడా నిర్మించారు. అయితే వీరిద్ద‌రికీ 2005లో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా, 2006లో గుట్టుచ‌ప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు..అయితే 2010 వరకు వీరికి పెళ్లయింది అని ఎవరికి తెలియదు , రాధికా మీడియా ముందుకు వచ్చి వారికి 2006 లో వివాహం అయింది అని అధికారంగా ప్రకటన చేశారు.అంటే దీన్నిబ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ఇంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేయాల్సి వ‌చ్చిందో. వీరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ , ప్ర‌స్తుతం కుమార‌స్వామి వ‌య‌సు 58 ఏళ్లు కాగా, ఆయ‌న భార్య రాధిక వ‌య‌సు 31 ఏళ్లు.వీరిద్ద‌రికి ఓ కూతురు కూడా ఉంది.ఆమె పేరు శామికా కుమార‌స్వామి.

రాధిక ది కూడా రెండవ పెళ్లి

అయితే, రాధికకు,కుమార‌స్వామికి ఇది రెండోవివాహం. కుమార‌స్వామి మొద‌ట‌గా అనితను పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.అత‌ని పేరు నిఖిల్ గౌడ‌. రీసెంట్ గా వ‌చ్చిన జాగ్వార్ మూవీ హీరో అత‌నే. రాధిక కూడా మొద‌ట‌గా ర‌తన్ కుమార్ అనే వ్య‌క్తిని 2006 లో పెళ్లి చేసుకుంది.అనివార్య కార‌ణాల వ‌ల్ల అతనికి విడాకులు ఇచ్చేసి కుమార‌స్వామిని రెండో వివాహం చేసుకోవ‌టం విశేషం.వీరి పెళ్లి కూడా అప్పట్లో సంచలనం అయింది.