షణ్ముఖుడు అంటే ఎవరు? ఆయన వాహనం ఏంటి?

షణ్ముఖుడు అనగా కుమార స్వామి.దీనికి అర్థం ఆరు ముఖాలు కలవాడని అర్థం.

 Kumara Swamy Special Sotry , Kumara Swami , Devotional , Shanmukudu , Subramanya-TeluguStop.com

అంతే కాదండోయ్ కుమార స్వామికి ఆరు తలలతో పాటు 12 చేతులు కూడా ఉంటాయి.ఆది దంపతులైన శివుడు , పార్వతుల కుమారుడే ఈ కుమార స్వామి.

వినాయకుడి అన్న.దేవతలందరకీ ఈయనే సేనాధిపతి.

కుమార స్వామకి కేవలం షణ్ముఖుడు అనే పేరు మాత్రమే కాదండోయ్.బ్రహ్మ జ్ఞానం తెలిసినందున సుబ్రహ్మణ్యుడుగా, కృతికా నక్షత్రంలో పుట్టినందున కార్తికేయుడుగా, రెల్లుగడ్డిలో అవతరించినందున శరవణుడుగా, పార్వతీ దేవి పిలిచినందున స్కందుడుగా, శూలాన్ని ఆయుధంగా వాడటం వల్ల వేలాయుధుడుగా పేర్లు వచ్చార్యి.

ఈయన వాహనం నెమలి.ఈయన బ్రహ్మచారి అని స్కంద పురాణంలో ఉంది.

కుమార స్వామి ఒక రోజు పిల్లిని గిల్లితే తన తల్లికి గాయమైందట.విషయం గ్రహించిన కుమార స్వామి అమ్మా నీకేమైందని అడిగాడు.స్పందించిన జగన్మాత ఈ ప్రపంచంలోని ప్రతీ ప్రాణిలో తాను ఉన్నానని చెబుతుంది.తాను లేనిదే ఈ సృష్టి లేదని వివరిస్తుంది.నీవు పిల్లిని గిల్లడం వల్లే నా చెంపకు గాయమైందని తెలిపింది.అది విన్న కార్తికేయుడు లోకంలోని ఏ ఒక్కరినీ బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు.

అలాగే అందరి అమ్మాయిల్లో తన తల్లి ప్రతి రూపం ఉంటుందని భావించి పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నాడు.అందుకే కుమార స్వామి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.

బ్రహ్మచారిగా ఉండి పోయాడు.తల్లి మాటకు అంత గౌరవం ఇచ్చే ఆ కుమార స్వామి.

భక్తులు కోరిన కోర్కెలు కూడా వెంటనే తీర్చుతాడని ప్రతీతి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube