కులభూషణ్ మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు  

Kulbhushan Jadhav Sentence Stayed-

పాకిస్తాన్ అక్రమంగా అరెస్ట్ చేసి మరణశిక్ష విధించిన భారతీయ నేవీ అధికారి కులభూషణ్ వ్యవహారం ఇప్పుడు మరోసారి రెండు దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది.కులభూషణ్ కి పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ విధించిన మరణశిక్షని సవాల్ చేస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానం కులభూషణ్ కేసుపై తీర్పు ఇచ్చింది..

Kulbhushan Jadhav Sentence Stayed--Kulbhushan Jadhav Sentence Stayed-

అతని మరణ శిక్షని నిలిపేయాలని పాకిస్తాన్ కి ఆదేశించింది.దీంతో ఈ కేసుపై ఇప్పుడు భారతీయులలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.ఇక ఈ వ్యవహారంపై అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు.

న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆమె ట్విట్టర్ లో హర్షం వ్యక్తంచేశారు.భారత్ కు ఇదో గొప్ప విజయం అని అన్నారు.కుల్ భూషణ్ జాదవ్ కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో హరీశ్ సాల్వే అద్బుతంగా వాదించారని ప్రత్యేకంగా అభినందించారు.

అంతర్జాతీయ వేదికపై భారత్ కు విజయం అందించినందుకు హరీశ్ సాల్వేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.ఇక ఈ కేసుని జాదవ్ మరింత బలంగా వాదించి ముందుకి తీసుకెళ్లాలని సూచించారు.కులభూషణ్ ని నిర్దోషిగా నిరూపించి విడుదల చేయాలని కోరారు.

ఇక కుల భూషణ్ కేసుని వాదించడానికి హరీష్ సాల్వే అప్పట్లో ముందుకొచ్చి కేవలం ఒక్క రూపాయి ఫీజు తీసుకొని వాదించడం సంచలనంగా మారింది.ఇక కుల భూషణ్ మరణశిక్షని నిలిపివేత ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ కి గట్టి దెబ్బ తగిలినట్లు అయ్యింది/