అమ్మ ముందే 17 ఏళ్ళకే అన్నీ కోల్పోయాను.. రెండున్నరేళ్లు నరకం చూశాను: నటి

పైకి నవ్వుతూ కనిపించే ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలతో పాటుగా వెంటాడే పీడకలలు కూడా ఉంటాయి.కేవలం సామాన్యుల జీవితాలే మాత్రమే కాకుండా సెలబ్రిటీల జీవితాలు కూడా అందుకు అతీతంగా ఉంటాయి.

 Kubbra Sait Says She Was Sexually Abused Two And Half Years Family Friend, Open-TeluguStop.com

తెరపై నవ్వుతూ కనిపించే సెలబ్రిటీల జీవితాలలో కూడా బాధలు కష్టాలు ఉంటాయి.కానీ సెలబ్రిటీలు మాత్రం ఎన్ని బాధలు కష్టాలు ఉన్నప్పటికీ తెరపై నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

అలాంటి వారిలో నటి కుబ్ర సైత్‌ కూడా ఒకరు.ఈమె ఎన్నో ఏళ్లుగా భరిస్తున్న బాధను ఎట్టకేలకు బయటపెట్టి కొంత భారాన్ని తగ్గించుకుంది.

అయితే ఆమె నోటితో కాకపోయినా తను రాసిన ఓపెన్‌ బుక్‌: నాట్‌ క్వైట్‌ ఎ మెమోయిర్‌ అనే పుస్తకంలో ఎంతోకాలంగా అనుభవిస్తున్న వేదనను బయటపెట్టింది.తనకు 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన ఫ్యామిలీతో కలిసి బెంగుళూరు లోని ఒక రెస్టారెంట్ కి తరచు వెళ్తూ వుండేదట.

అలా ఆ రెస్టారెంట్ యజమాని ఆమె కుటుంబానికి దగ్గరవడం తో పాటు ఆమె తల్లికి ఆర్థికంగా కూడా సహాయం చేసేవాడట.అలా అతని అసలు రూపం బయటపడిందట.

అలా ఒకరోజు కార్లో కూర్చొని వెళుతూ ఉండగా ఆమె తొడ మీద చెయ్యి వేసి నిమురుతూ, అసభ్యకరంగా తాకుతూ వేధించడం మొదలు పెట్టాడట.ఆమె అంకుల్ అని పిలువగా అలా పిలవద్దు అని చెప్పేవాడట.

Telugu Bollywood, Kubbra, Kubbra Sait, Kubbrasait, Memoir-Movie

అలా నెమ్మదిగా ఆమె ఇంటికి రావడం కూడా మొదలు పెట్టగా, అయితే అతని వంకరబుద్ధి తెలియక కుబ్ర సైత్‌ తల్లి అతనికి వంట కూడా చేసి పెట్టేదట.అతను ఈ విధంగా ఆమె తల్లి ముందే కుబ్ర సైత్‌ కు ముద్దు పెట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేవాడట.అయితే ఆ సమయంలో కుబ్ర సైత్‌ కు కాస్త అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఏమి చేయలేక మౌనంగా ఉండేదట.ఒకరోజు అతను కుబ్ర సైత్‌ ను హోటల్ కి తీసుకుని వెళ్లి ఆమె పెదాలపై ముద్దు పెట్టడంతో ఆమె ఒక్క సారిగా షాక్ అయిందట.

అయితే అతడు చేసిన పనికి షాక్ లో ఉండిపోయి ఆమె నోటి నుంచి మాట రాకపోవడంతో అదే అలుసుగా భావించిన అతను ముద్దులతో రెచ్చిపోయాడట.అలా ఆమె తన వర్జినిటీ కోల్పోయానని అదే తన జీవితంలో అత్యంత సిగ్గుచేటు రహస్యం అని తెలిపారు కుబ్ర సైత్‌.

అలా అతని ఆమెను రెండున్నరేళ్లపాటు అతడు లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది కుబ్ర సైత్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube